మహా విలయం సునామీకి పదేళ్ళు -ఫోటోలు
డిసెంబర్ 26, 2014 తేదీతో ఆనాటి సునామీకి పదేళ్ళు నిండాయి. ఇండోనేషియా తీరానికి సమీపంలో హిందూ మహా సముద్రంలో సంభవించిన భారీ భూకంపం వల్ల సంభవించిన సునామీలో 14 దేశాల్లో 2,30.000 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇందులో అత్యధికులు ఇండోనేషియాలోని సుమత్ర ద్వీపానికి చెందినవారే. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని చెప్పేవారూ ఉన్నారు. సముద్రంలో ఆటు, పోటుల గురించి తెలియడమే గానీ సునామీ గురించి అప్పటికి ఎవరికీ తెలియదు లేదా తెలిసినవారు చాలా తక్కువ.…