బి.జె.పి పాత్రధారుల పరిణామక్రమం

బి.జె.పి నేటి పూర్తి మెజారిటీ అధికారాన్ని హస్తగతం చేసుకునే క్రమంలో ఆ పార్టీ నాయకులు ధరించిన వివిధ పాత్రల పరిణామాన్ని పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ఆ మాటకు వస్తే దాదాపు ప్రతి (దోపిడి) పార్టీ లోనూ జనాన్ని రెచ్చగొట్టే అతివాద పాత్రలు కొన్ని, జనానికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా చేయవలసిన పనిని చేసుకుంటూ పోయే పాత్రలు మరి కొన్నీ కనిపిస్తాయి. ఇలా రెండు రకాల పాత్రలను జనం ముందు ఉంచవలసిన అవసరం రాజకీయ పార్టీలకు ఎందుకు…

ఈ హిందూత్వ అభిమాని బూతు కూతలు చూడండి!

ఈ వ్యక్తి పేరును ఉటంకించే ధైర్యం నేను చేయలేకున్నాను. ఆ పేరు నిజానికి హిందూ ప్రజలు ఇష్టంతో కొలుచుకునే దైవం పేరు. కానీ ఈయనగారి బూతు పాండిత్యం చూస్తేనేమో హిందూ భక్తులకు తధ్యంగా అసహ్యం వేస్తుంది. మరీ ముఖ్యంగా హిందూ సంస్కృతి గొప్పదనం గురించి, సుప్రిమసీ గురించి వివరించే వ్యాసాలకూ, వీడియోలకూ ఎక్కడెక్కడ నుండో లింకులు తెచ్చే పోస్ట్ చేసే సంస్కృతీ పరిరక్షకుడు తాను రక్షిస్తానని చెప్పే సంస్కృతిని పీక నులిమి చంపడానికి ఏ మాత్రం వెనుదీయని…

హిందూత్వ డిమాండ్లకు రాజ్యాంగ మద్దతు ఉంది -ఆర్.ఎస్.ఎస్

బి.జె.పి మొదటిసారి సొంతగా మెజారిటీ సాధించిన నేపధ్యంలో ఆ పార్టీ మాతృ సంస్ధ ఆర్.ఎస్.ఎస్ ఆశలు మోసులెత్తుతున్నాయి. హిందూత్వ డిమాండ్లను మోడి నెరవేర్చాల్సిందేనని ఆర్.ఎస్.ఎస్ అగ్రనేతలు స్పష్టం చేస్తున్నారు. బి.జె.పి మేనిఫెస్టోలో సాంస్కృతిక విభాగంలోకి నెట్టివేశామని ఎన్నికలకు ముందు చెప్పిన హిందూత్వ డిమాండ్లు ఇప్పుడు కేంద్ర స్ధానానికి తెచ్చే ప్రయత్నంలో ఆర్.ఎస్.ఎస్ ఉన్నదని సంస్ధ సిద్ధాంత కర్త ఎం.జి.వైద్య మాటల ద్వారా అర్ధం అవుతోంది. “అయోధ్యలో రామ మందిరం, ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్ 370 రద్దు……

మోడి ‘అభివృద్ధి’ పరిణామం ఇదీ! -కార్టూన్

2014 సాధారణ ఎన్నికలకు రెండు సంవత్సరాలకు ముందే నరేంద్ర మోడి ‘సద్భావనా మిషన్’ పేరుతో తాను అందరివాడినని చెప్పేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు ప్రకటించాక ‘అభివృద్ధి’ మంత్రం అందుకున్నారు. గుజరాత్ లో తాను చేసిన అభివృద్ధి దేశం అంతా అమలు చేస్తానని ప్రచారం చేస్తారు. తాను ప్రసంగించిన చోటల్లా ఉద్యోగాల ప్రస్తావన తేవడం ద్వారా ఓటర్లలో సగం వరకూ ఉన్న యువతను ఆకర్శించేందుకు ఎర వేశారు. తాను ప్రధాని అయితే ‘ఉద్యోగాలే ఉద్యోగాలు’ అన్నారు. తీరా ఎన్నికలతో పాటు…

హిందుత్వ నుండి మోడి పారిపోగలరా? -కార్టూన్

హిందుత్వను ప్రభోదిస్తూ దాన్నుండి దూరంగా ఉన్నారన్న భ్రమల్ని ప్రజల్లో కలిగించడం అంటే మాటలు కాదు. అలాంటి బృహత్కార్యాన్ని విజవంతంగా నిర్వహించినవారిలో ప్రముఖులు అటల్ బిహారీ వాజ్ పేయ్. హిందూత్వలో మోడరేటర్ గా ముద్ర పొందుతూనే అవసరం వచ్చినప్పుడు కరడు గట్టిన హిందూత్వను ప్రదర్శించడం వాజ్ పేయి కి మించినవారు లేరు. తాను కరకు ఆర్.ఎస్.ఎస్ వాడినని చెబుతూనే సెక్యులరిస్టులకు, హిందూత్వ నుండి దూరంగా ఉండదలచినవారికీ ఆయన ఆమోద యోగ్యుడు కాగలిగారంటే అది వాజ్ పేయి చాతుర్యమే అని…