మీ దాష్టీకం యూపిలో చెల్లవచ్చేమో, ఇక్కడ కాదు -యూపి పోలీసుల్తో ఢిల్లీ హై కోర్టు
ఉత్తర ప్రదేశ్ పోలీసులకి ఢిల్లీ హై కోర్టు గడ్డి పెట్టింది. మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా అత్యంత అప్రజాస్వామిక చట్టం చేయడమే కాకుండా సదరు చట్టం పేరుతో విచక్షణారహితంగా వివాహితులను వారి కుటుంబ సభ్యులను అరెస్టులు చేసి జైళ్ళలో తోస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న యూపి ప్రభుత్వానికి కూడా ఢిల్లీ హై కోర్టు పరోక్షంగా జ్ఞాన బోధ చేసింది. “ఇక్కడ ఢిల్లీలో మీ చర్యలు చెల్లబోవు. ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలైనా సరే చెల్లవు. ఢిల్లీ నుండి జనాన్ని…