అరవింద్: తోడేళ్ళకు భయపడే మేకల కాపరి -కార్టూన్

ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటుపై మళ్ళీ కదలిక మొదలు కావడంతో ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ కు పెద్ద చిక్కొచ్చిపడింది. తమ ఎమ్మెల్యేలను కాపలా కాసే కాపరిగా ఆయనకు కొత్త బాధ్యతలు వచ్చిపడ్డాయి. శాసనసభలో అతి పెద్ద పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి సఫారసు చేస్తూ అందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో ఎఎపి నేతకు ఈ అదనపు బాధ్యతలు వచ్చిపడ్డాయి. ఈ కార్టూన్ కి రెండు అర్ధాలు చెప్పుకోవచ్చు. ఒకటి:…

ఎమ్మెల్యేకు బి.జె.పి వెల రు. 4 కోట్లు -ఎఎపి వీడియో

ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అనైతికం ఏమీ లెదంటూ ప్రకటించిన బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా అంతరార్ధం ఏమిటో ఎఎపి పార్టీ వెల్లడి చేసింది. తమ ఎం.ఎల్.ఎ లు ఇద్దరినీ కొనుగోలు చేసేందుకు బి.జె.పి ఢిల్లీ శాఖ ఉపాధ్యక్షుడు షేర్ సింగ్ దాగర్ ఒక్కొక్కరికి 4 కోట్లు ఇవ్వజూపారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సాక్ష్యంగా వీడియోను కూడా ఎఎపి విడుదల చేసింది. ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నించడం గురించి విలేఖరులు అడిగిన…