పొగాకు లాబీకి లొంగి కేంద్ర మంత్రి తొలగింపు?

విదేశీ కంపెనీల లాభాలు పడిపోకుండా ఉండడానికీ, వీలయితే ఇంకా ఇంకా పెంచడానికీ స్వదేశీ భాజపా మంత్రుల పాట్లు అన్నీ ఇన్నీ కాకుండా పోతున్నాయి. ‘ఊరంతా ఒకదారయితే ఉలిపిరి కట్టెది మరోదారి’ అన్నట్లుగా కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తూ తమ బుద్ధి మాంద్యాన్ని చాటుకుంటున్నారు. కాగా పొగాకు లాబీకి లొంగి ప్రధాని నరేంద్ర మోడి ఆరోగ్య మంత్రిగా హర్షవర్ధన్ ను తప్పించారని ప్రతిపక్షాలు ఆరోపించడం ప్రజలు గమనించవలసిన విషయం. లేకపోతే ధూమపానం వల్ల/సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని…

ఆమ్ ఆద్మీ పార్టీ అడుగు జాడల్లో…. కార్టూన్

ఎఎపి నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వరుస చర్యలతో దూసుకెళ్తున్న నేపధ్యంలో కాంగ్రెస్, బి.జె.పి లు అప్పుడే ఆ పార్టీని అనుకరించడం ప్రారంభించాయి. ఢిల్లీ ప్రభుత్వం లాగానే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ ధరలను తగ్గించాలని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేయగా బి.జె.పి నాయకులు సైతం ఎఎపి ప్రభుత్వ నిర్ణయాలను అనుకరించే యోచనలో ఉండడం విశేషం. మహారాష్ట్ర నుండి ఎం.పిగా ఉన్న సంజయ్ నిరుపమ్ గురువారం విద్యుత్ ఛార్జీల విషయంలో ఒక డిమాండ్ ముందుకు తెచ్చి…