హర్యానాలో మరో దాద్రి!

ఆవును చంపి తిన్నారని ఆరోపిస్తూ మతోన్మాద మూకలు దాద్రి (ఉత్తర ప్రదేశ్) లో ముస్లిం కుటుంబంపై దాడి చేసి యజమానిని చంపిన ఘటనపై పార్లమెంటులో, దేశం అంతటా చర్చ జరుగుతుండగానే బి.జె.పి పాలిత హర్యానా రాష్ట్రంలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. బాధితులకు ప్రాణాలు దక్కడం ఒక్కటే తేడా. హర్యానా రాష్ట్రం, పాల్వాల్ లో గురువారం జరిగిన ఘటనలో ఆవు మాంసం తరలిస్తున్నారన్న ఆరోపణతో ఒక వ్యాన్ డ్రైవర్, సహాయకుడిపై దాడి చేసి విపరీతంగా కొట్టారు.…

ఆత్మహత్య రైతులు పిరికిపందలు, నేరస్ధులు -బి.జె.పి

భూ సేకరణ చట్టం సవరణల ద్వారా తన రైతు వ్యతిరేక, ప్రైవేటు బహుళజాతి కంపెనీ అనుకూల స్వభావాన్ని చాటుకున్న బి.జె.పి ఇప్పుడు ఏకంగా రైతులపై నేరుగా దాడి చేసేందుకు సైతం వెనుదీయడం లేదు. ఢిల్లీలో ఎఎపి నిర్వహించిన రైతుల ర్యాలీలో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడడాన్ని ‘నాటకం’గా అభివర్ణించిన హర్యానా వ్యవసాయ మంత్రి, ఆత్మహత్యకు పాల్పడే రైతులు ‘పిరికిపందలు’ అనీ, ‘నేరస్ధులు’ అనీ తిట్టిపోసాడు. “భారత చట్టం ప్రకారం ఆత్మహత్యకు పాల్పడడం నేరం. ఆత్మహత్యకు పాల్పడే ఏ…

కటకటాల సంత్ రాంపాల్

ఇంజనీర్ కమ్ సంత్ రాంపాల్ ఎట్టకేలకు కటకటాల వెనక్కి చేరారు. గారడీ విద్యలతో, బూటకపు శాస్త్ర పరిజ్ఞానంతో ఉత్తర, మధ్య భారతంలో అనేకమందిని తన భక్తులు/శిష్యులుగా చేసుకున్న సంత్ రాంపాల్ ను లొంగదీయడంలో పంజాబ్ & హర్యానా హై కోర్టు ఎట్టకేలకు సఫలం అయింది. 2010 నుండి కోర్టు జారీ చేసిన 43 సమన్లను లెక్క చేయకుండా ఎప్పటికప్పుడు మినహాయింపు కోరుతూ వచ్చిన రామ్ పాల్ లోయర్ల జోలికి వెళ్లడంతో కటకటాల వెనక్కి చేరక తప్పలేదు. 2006లో…

బాబా రాంపాల్ అరెస్టుకు సాయుధ ప్రతిఘటన

దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించని నేపధ్యంలో బాబా రాంపాల్ ని అరెస్టు చేయలేక హర్యానా పోలీసులు నిస్సహాయులుగా మిగిలారు. హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న బాబా రాంపాల్ అనేకసార్లు కోర్టుకు హాజరు కాకుండా చట్టం అంటే తనకు లెక్కలేదని చాటాడు. ఆయన్ని అరెస్టు చేసి తేవాలని పంజాబ్ & హర్యానా హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆయనకు వంట్లో బాగాలేదని కాబట్టి అరెస్టు చేయడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పడం బట్టి భారత దేశంలో కోర్టులు ఏ…