చట్టం అమలు: మెజారిటీలకి ఒకటి, మైనారిటీలకి ఒకటి

మునవర్ ఫరూకి ఒక స్టాండప్ కమెడియన్. జనాన్ని నవ్వించడం ఈ యువ కళాకారుడి వృత్తి, ప్రవృత్తి. జనవరి 1, 2021 తేదీ ఇండోర్ (మధ్య ప్రదేశ్) పట్టణంలో అతను ప్రదర్శన ఇవ్వబోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 295 ఏ కింద కేసు పెట్టారు. నేరం ఏమిటని విలేఖరులు అడిగితే “తన కామెడీ షోలో ఇతరుల మత భావాలను నమ్మకాలను అవమానపరిచాడు” జిల్లా ఎస్‌పి అని చెప్పాడు. “మునవర్ ఆరోజు అసలు షో మొదలు పెట్టకుండానే అరెస్ట్…