ఉగ్రవాదాన్ని పాక్ బాగా అణచివేస్తోంది -అమెరికా

భారత పాలకులకు అమెరికా నుండి ఊహించని విధంగా (లేక ఊహించిందేనా?) చేదు అనుభవం ఎదురైంది. తమ దేశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ను ఒంటరిని చేసి సాధించాలని మన పాలకులు డిమాండ్ చేస్తుండగా అమెరికా మాత్రం పాకిస్ధాన్ ని “భేష్, ఉగ్రవాదాన్ని బాగా అణచివేస్తున్నావు” అని సర్టిఫికేట్ ఇచ్చింది. లష్కర్-ఏ-తొయిబా (LeT), జైష్-ఏ-మహమ్మద్ (JeM) లను ఉగ్రవాద సంస్ధలుగా అమెరికా పరిగణిస్తుంది. కానీ ఈ సంస్ధల నేతలు గత యేడు భారీ ర్యాలీలు నిర్వహించినప్పటికీ వాటిని…

క్లుప్తంగా… 29.04.2012

జాతీయం ఆఫ్ఘన్ సైనిక ఉపసంహరణతో భారత్ అప్రమత్తం కావాలి ఆఫ్ఘనిస్ధాన్ మత ఛాందస సంస్ధలు భారత్ సరిహద్దుల్లో జమకూడే ప్రమాదం ఉందని భారత సైనికాధికారి ఒకరు హెచ్చరించాడు. కర్ణాకటక లో ఒక కార్యక్రమంలో మాట్లాఆడుతూ ఆయన ఈ హెచ్చరిక చేశాడు. ముఖ్యంగా అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఉపసంహరించుకున్నాక ఈ ప్రమాదం తలెట్టవచ్చని ఆయన తెలిపాడు. జమాత్ ఉద్-దావా నాయకుడు, ముంబయ్ దాడులకు బాధ్యుడుగా అనుమానిస్తున్న హఫీజ్ సయీద్ ఇటీవల చేసిన ప్రకటనను ఆయన…

పాక్ కోర్టులో లష్కర్-ఎ-తయిబా చీఫ్ హఫీజ్ పిటిషన్

అమెరికా ఒత్తిడికి లొంగి పాకిస్ధాన్ ప్రభుత్వం తనపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నదనీ, ఆ ప్రయత్నాలను నిరోధించాలనీ కోరుతూ లష్కర్-ఎ-తయిబా (ఎల్.ఇ.టి) అధిపతి హఫీజ్ సయీద్ పాకిస్ధాన్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన జీవితానికి భద్రత లేదనీ, రక్షణ కల్పించాలనీ, ఏ క్షణంలోనైనా తనకు ప్రాణహాని జరగవచ్చనీ ఆయన పిటిషన్ లో కోరాడు. హాఫీజ్ పిటిషన్ మేరకు లాహోర్ హై కోర్టు పాక్ కేంద్ర ప్రభుత్వానికీ హోమ్ మంత్రికీ, పణ్జాబ్ హోమ్ మంత్రికి నోటీసులు జారీ…