ఊచకోతలపై నిరసన: ‘నాట్ ఇన్ మై నేమ్’ -ఫోటోలు

దేశంలో దళితులపైనా, ముస్లింల పైనా పెరిగిపోయిన హిందూత్వ మూకల దాడుల నేపధ్యంలో ప్రగతి కాముకులైన దేశ ప్రజలు గళం విప్పారు. గొంతు విప్పి ముందుకు వచ్చారు. తామూ హిందూ మతానికి చెందినవారమే అయినప్పటికీ తమ పేరుతో దళితులు, మైనారిటీలపైన దాడులు చేసి ఊచకోతలకు దిగడానికి మేము అనుమతించబోమని చాటి చెప్పారు. జూన్ 28 తేదీన దేశ వ్యాపితంగా అనేక నగరాల్లో ఆందోళనలు, నిరసన ప్రదర్శనల్లో పాల్గొని హింసాత్మక హిందూత్వ భావజాల వ్యాప్తికి తమ అనుమతి లేదని స్పష్టం…