పెనుగొండలో హంపి ఎక్స్ ప్రెస్ కి ప్రమాదం, 25 మంది దుర్మరణం -ఫోటోలు

హుబ్లి-బెంగుళూరు హంపి ఎక్స్ ప్రెస్ పెనుగొండ వద్ద ప్రమాదానికి గురయింది. ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీకొని మంటల్లో చిక్కుకోవడంతో 13 మంది మంటల్లో చిక్కుకుని చనిపోగా మిగిలినవారు గాయాలతో చనిపోయారని ‘ది హిందూ’ తెలిపింది. 3 గంటలకి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వేగంగా ఢీకొట్టడం వల్ల ఇంజను వెనక ఉన్న బోగీకి నిప్పు అంటుకుని ఆ తర్వాత మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే పెనుగొండ డి.ఎస్.పి కి కబురు అందిందనీ వెంటనే…