స్టేషన్ల చుట్టూ తిప్పారు, తిట్టారు, కొట్టారు, ఉమ్మారు!

హంద్వారా (కాశ్మీర్) అమ్మాయి ఎట్టకేలకు నోరు విప్పింది. పోలీసులే తన చేత బలవంతంగా అబద్ధం చెప్పించారని చెప్పింది. పోలీసులు ప్రచారం చేసుకున్న వీడియోలో తాను చెప్పినది నిజం కాదని వెల్లడి చేసింది. పోలీసులు చెప్పమన్నట్లు వీడియోలో చెప్పానని తెలిపింది. ఆ వీడియో రికార్డు చేసిన జిల్లా ఎస్‌పిని వీడియోను ఎవరికి చూపవద్దని కోరానని, కానీ అదే వీడియోను ఉపయోగించి తనపై దుష్ప్రచారం చేశారని తెలిపింది. తన కూతురును నిర్బంధంలో ఉంచుకుని ఆమె చేత అబద్ధం చెప్పించారని ఆమె…