ఓ యువరాణి, ఓ బఠాణి -అద్భుతమైన కార్టూన్

అవును! నిజంగా ఈ కార్టూన్ చాలా అద్భుతమైంది. దీన్ని అర్ధం చేసుకోవాలంటే మొదట ఒక చిన్న స్వీడిష్ కధ తెలుసుకోవాలి. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి ఒక యువరాజు. ఆయనకి పెళ్లి వయసు వచ్చేసింది. కానీ ఆయనకి ఎంతకీ వధువు నచ్చడం లేదు. కారణం ఆయనకి ఉన్న షరతులు. పెళ్లంటూ చేసుకుంటే మరో యువరాణినే చేసుకోవాలని ఆయనగారి ఖచ్చితమైన కోరిక. ఆ యువరాణి కూడా అత్యంత సున్నితంగా ఉండాలి. కాలనేది కింద పెట్టకుండా పట్టుపరుపుల మీద…