(ఖాతాదారుల) వెల్లడికి మించి వెళ్లాలి… -ది హిందు ఎడిట్

పన్నుల విషయాల్లో గోప్యత అనేది ప్రాధమిక (అధికార) కార్యకలాపాల్లో అనుసరించవలసిన ప్రక్రియలలో తప్పనిసరి భాగమే కాకుండా పన్నుల ఎగవేతను నివారించేందుకు కావలసిన అంతర్జాతీయ సహకారంలో అత్యవసర దినుసు కూడా. అయితే, ఇతర దేశాలు పంచుకున్న వివరాలపై తగిన విధంగా చేయవలసిన పరిశోధనను ఎగవేసేందుకు అది సాకు కారాదు. కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్ లో 627 మంది పేర్లతో కూడిన జాబితాను అందించక తప్పని పరిస్ధితి కేంద్ర ప్రభుత్వానికి వచ్చేలా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంలో మనకు…

నల్లడబ్బు వివరాలన్నీ చెప్పలేరట!

నల్ల డబ్బు కధ మరో చుట్టు తిరిగొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నల్లడబ్బు వివరాలను దాచి ఉంచడానికి ఏయే కతలు చెప్పారో సరిగ్గా అవే కధల్ని మన అవినీతి వ్యతిరేక ఛాంపియన్ అయిన నరేంద్ర మోడీగారి ప్రభుత్వం వినిపిస్తోంది. దేశం దాటి పోయి అనేక రహస్య స్విస్ ఖాతాల బంకర్లలో శత్రు దుర్భేద్యమై నక్కిన నల్లడబ్బుని మెడపట్టి లాక్కొచ్చి జనానికి అప్పజెపుతామని వీరాలాపాలు పలికిన మోడి గారి ప్రభుత్వం కాంగ్రెస్ చెప్పిన మాటల్నే చిలక పలుకుల్లా వల్లిస్తోంది. ఎన్.డి.ఏ…

స్విస్ నల్ల ధనం అను ఒక ప్రహసనం -కార్టూన్

“ఆగండాగండి, ఇదిగో లేఖ జారవిడుస్తున్నా, ఇక తెరుచుకోవడమే తరువాయి.” *** అధికారంలోకి వచ్చీ రావడంతోనే విదేశాల్లో భారతీయులు దాచిన నల్ల డబ్బును వెనక్కి తేవడానికి అని చెబుతూ మోడి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జస్టిస్ ఎం.బి.షా నేతృత్వంలో ఏర్పాటయిన ఈ కమిటీ వాస్తవానికి సుప్రీం కోర్టు ఆదేశాలకు ఏర్పాటు చేశారన్న వాస్తవాన్ని చెప్పిన పత్రికలు చాలా తక్కువ. ఈ కమిటీ పని ఎంతవరకు వచ్చిందో తెలియదు గానీ కొద్ది రోజుల తేడాలోనే పరస్పర…

స్విస్ ఖాతాల సమాచారం పొందడానికి నిబంధనలు సరళతరం

స్విస్ బ్యాంకుల్లో దొంగ సొమ్ము దాచిన భారతీయుల సమాచారం పొందడానికి ఇప్పటివరకూ ఉన్న నిబంధనలు మరింత సరళతరం అయ్యాయని భారత ప్రభుత్వం తెలియజేసింది. ‘బ్లాక్ మనీ’ పై భారత ప్రభుత్వం తలపెట్టిన పోరాటం తాజా పరిణామంతో ఊపందుకుంటుందని భావిస్తున్నట్లు ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. రహస్య ఖాతాలున్న వ్యక్తుల సమాచారం స్విస్ ప్రభుత్వం మనకు ఇవ్వడానికి ఇకనుండి పేరు, చిరునామా పూర్తిగా ఇవ్వకపోయినా ఫర్వాలేదనీ, సమీప సమాచారం ఇస్తే సరిపోయే విధంగా నిబంధనలు సడలించారనీ ప్రభుత్వం తెలిపింది.…