సనాతన కుల-మత వ్యవస్ధ పునరుద్ధరణే కంగనా ప్రబోధిస్తున్న విముక్తి!

నటి కంగనా రనౌత్ తన వ్యాఖ్యలపై కొంత స్పష్టత ఇచ్చారు. తాను అన్నీ తెలిసే 1947 నాటి స్వతంత్రంపై వ్యాఖ్యానించానని తన వివరణ ద్వారా స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు తప్పయితే తన ‘పద్మ శ్రీ’ అవార్డు వెనక్కి ఇచ్చేందుకు సిద్ధం అని ప్రకటించారు. దానికి ముందు తన అనుమానాలు తీర్చాలని ఆమె కొన్ని ప్రశ్నలు సంధించారు. తన అనుమానాలకు సంతృప్తికరంగా సమాధానం ఇస్తే అవార్డు ఇచ్చేస్తానని చెప్పారు. అయితే కంగనా రనౌత్ ఇచ్చిన వివరణ మరిన్ని…

‘మేక్’ ఇన్ ఇండియా -కార్టూన్

బులెట్ ప్రూఫ్ అద్దాలు లేకుండా ఎర్రకోటపై నిలబడి మొదటిసారి దేశ ప్రజలకు స్వాంతంత్ర్య సందేశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడి విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలికారు. ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ ఇండియా రావాలనీ పిలుపు ఇచ్చారు. ఇక్కడ సరుకులు ఉత్పత్తి చేసి ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఆశ చూపారు. విదేశీ కంపెనీలకు ఎర్ర తివాచీ పరుస్తానని ఎర్రకోట బురుజులపై నిలబడి చాటింపు వేశారు. ఇప్పుడు ఏ సరుకు చూసినా ‘మేడ్ ఇన్ చైనా’ స్టిక్కర్ ను ప్రదర్శించేవే.…