డిగ్రీ వివరాలు ఇవ్వొద్దని స్మృతి కోరారు -యూనివర్సిటీ

తన చదువు వివరాలు ఆర్‌టి‌ఐ దరఖాస్తుదారుకు ఇవ్వొద్దని మానవ వనరుల శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత టెక్స్ టైల్స్ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తమను కోరారనీ అందుకే ఆమె డిగ్రీ వివరాలను దరఖాస్తుదారుకు ఇవ్వలేదని స్కూల్ ఆఫ్ ఓపెన్ లర్నింగ్ (ఎస్‌ఓ‌ఎల్), సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి‌ఐ‌సి) కు వివరణ ఇచ్చింది. మంత్రి ఒత్తిడితోనే ఇరానీ చదువు వివరాలను విద్యా సంస్ధ ఇవ్వలేదని ఈ వివరణతో స్పష్టం అవుతున్నది. స్మృతి ఇరానీ తన విద్యార్హతల వివరాలను…

వీడియో మార్ఫింగ్ స్మృతి సలహాదారు పని?

జే‌ఎన్‌యూ విద్యార్ధుల ఆందోళన, అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమం లకు సంబంధించి ఇంటర్నెట్ లోనూ, టి.వి న్యూస్ ఛానెల్స్ తదితర ప్రసార మాధ్యమాల్లోనూ ప్రచారంలో ఉన్న 7 వీడియోల్లో మూడు వీడియోలలో ఉద్దేశ్యపూర్వకంగా మార్పులు చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వం నియమించిన మెజిస్టీరియల్ విచారణలో తేలిన సంగతి విదితమే. మార్పులు చేసిన మూడు వీడియోల్లో ఒక వీడియోను ఎడిట్ చేయగా, రెండు వీడియోలు కావలసిన అర్ధం వచ్చే విధంగా, కోరుకున్న ప్రభావం కలిగే విధంగా ఉద్దేశ్యపూర్వకంగా మార్ఫింగ్ చేశారని…

పోలీసుల ముందే కొట్టారు -కన్హైయా

ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం చెబుతున్నారో తెలియని పరిస్ధితుల్లో వీడియోలు చూస్తే తప్ప నమ్మలేని పరిస్ధితి దాపురించింది. శాస్త్ర పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సుఖమయం చేయడం ఏమో గానీ కుట్రదారులకు మాత్రం అది బాగా ఉపకరిస్తోంది. నేరుగా వాదించి నెగ్గలేని హిందూత్వ సంస్ధలు వీడియో మార్ఫింగ్ లకు దిగడంతో చివరికి వీడియోలను సైతం పట్టి పట్టి చూడవలసి వస్తోంది. కన్హైయా కుమార్ ని ఎవరూ కొట్టలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి ఎస్ బస్సీ ఆర్భాటంగా…

మహిషాసురుడు సభకు ఎందుకు వచ్చాడు?

మహిషాసుర సంహారానికి వ్యతిరేకంగా, హిందూ నమ్మకాలకు విరుద్ధంగా మహిషాసురుడి అమర దినాన్ని జే‌ఎన్‌యూ లోని ఎస్‌సి, ఎస్‌టి, ఓ‌బి‌సి, మైనారిటీ విద్యార్ధులు జరపడం “మానసిక భ్రష్టత్వంగా మానవ వనరుల శాఖ మంత్రి నిన్న పార్లమెంటులో తూలనాడారు. హిందూ పురాణాలలో దేవతలుగా, వీరులుగా, దేవుళ్ళుగా కొలవబడుతున్నవాళ్ళు దేశంలో అనేక మూలల్లో విలన్లుగా చీత్కరిస్తున్న వాస్తవాలు మంత్రి గారికి తెలియక కాదు. రిజర్వేషన్ వ్యతిరేక, హిందూ భావోద్వేగ, అగ్రకులాల ఓట్లను సొమ్ము చేసుకునేందుకు ఆమె హిందూ సాంప్రదాయాలను దళితులు తూలనాడుతున్నారన్న…

స్మృతి మళ్ళీ అబద్ధం చెప్పారు!

నోరు తెరిస్తే అబద్ధమేనా? బాధ్యతగల కేంద్ర మంత్రి పదవిలో ఉంటూ కూడా! తన ప్రసంగానికి భావోద్వేగాలను అద్దడం కోసం జరగనివి జరిగినట్లుగా, జరిగినవి జరగనట్లుగా చెప్పడం ఎవరికైనా తగునా? లేక దేశాన్ని ఏలుతున్నారు గనుక కేంద్ర మంత్రులకు తగుతుందా? కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అబద్ధాల పర్వం కొనసాగుతోంది. అత్యున్నత ప్రజాస్వామిక దేవాలయంగా చెప్పుకునే పార్లమెంటులోనే ఆమె అబద్ధాలు చెప్పేస్తున్నారు. అది కూడా ఒక చనిపోయిన విద్యార్ధి కుటుంబం లక్ష్యంగా! రోహిత్ వేముల…

రోహిత్ ఆత్మహత్య: సస్పెన్షన్ ఎత్తివేత

కేంద్ర ప్రభుత్వ విశ్వ విద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రోహిత్ మిత్రులు నలుగురు రీసర్చ్ స్కాలర్ విద్యార్ధులపై స్పస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెన్షన్ ఎత్తివేత తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. సస్పెన్షన్ ఎత్తివేసినందున విద్యార్ధులంతా సాధారణ విద్యా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని వైస్ ఛాన్సలర్ పి అప్పారావు కోరారు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియమించిన సబ్ కమిటీ గురువారం సమావేశమై సస్పెన్షన్ ను బేషరతుగా ఎత్తివేయడానికి నిర్ణయించిందని పాలకవర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. “యూనివర్సిటీలో నెలకొన్న అసాధారణ…

రోహిత్: దళిత విద్యార్ధులు Vs హిందూత్వ రాజ్యం!

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎట్టకేలకు నోరు విప్పారు. ఆమె ఇచ్చిన వివరణ విద్యార్ధుల భావోద్వేగాలను చల్లార్చడానికి బదులు మరింత రెచ్చగొట్టినట్లుగానే వెలువడింది. “ఇది దళితులు-దళితేతరుల మధ్య సమస్యకు సంబంధించినది కాదు. రెండు విద్యార్ధి సంఘాలకు మధ్య ఘర్షణకు సంబంధించిన సమస్య. దళిత్ పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టొద్దు” అని ఆమె ప్రకటించారు. అదే నోటితో ఆమె “వైస్ ఛాన్సలర్ ఆదేశాలను (ఆర్డర్ ను) విద్యార్ధులకు స్వయంగా అందించిన వ్యక్తికూడా దళితుడే” అంటూ తాను కూడా దళితుడి భుజం…

తప్పు లేదని నిర్ధారించినా సస్పెన్షన్ ఎందుకు?

ఏ‌ఎస్‌ఏ విద్యార్ధులు ఏ తప్పూ చేయలేదనీ, వారు తప్పు చేశారని చెప్పేందుకు ఎలాంటి సాక్షాలూ లేవని యూనివర్సిటీ నియమించిన కమిటీ నిర్ధారించింది. అయినప్పటికీ ఆ అయిదుగురినీ యూనివర్సిటీ కౌన్సిల్ ఎందుకు సస్పెండ్ చేసింది? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పి అప్పారావు నియమితులు కావడానికి ముందు నియమించబడిన కమిటీ దళిత విద్యార్ధులది ఎలాంటి తప్పూ లేదని తేల్చింది. దానితో వారిపై ఎలాంటి చర్యకూ ఆస్కారం లేదు. కనుక సస్పెన్షన్ నన్ను రద్దు చేశారు. కానీ ఆ తర్వాతే…

ఎవరి గౌరవమీ ట్రయల్ రూముల రహస్య కెమెరాలు?

సాక్ష్యాత్తు కేంద్ర మంత్రి గారే విపత్కర పరిస్ధితిని ఎదుర్కొన్నారు. లేదా ఎదుర్కొన్నానని మంత్రి గారు లోకానికి చాటారు. అదేమీ లేదని ఫాబ్ ఇండియా వారు వివరణ ఇచ్చుకున్నప్పటికీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన ఆరోపణ విస్తృత వ్యాప్తిలో ఉన్న ఒక అసహ్యకరమైన వ్యాధిని వెలుగులోకి తెచ్చింది. ఈ వ్యాధి ఉన్నదని అందరికీ తెలుసు. కానీ అదేమీ ఎరగనట్లు నటించడమే వ్యాధి విస్తరణకు ప్రధాన పోషకురాలు. ఈ రీత్యా స్మృతి ఇరానీ చిన్నపాటి సాహసం చేశారని చెప్పవచ్చు.…

కాదేదీ రాజకీయాల కనర్హం! టీచర్స్ డే కూడా -కార్టూన్

A for Achche din… గతంలో ఎన్నడూ ఎవరూ పెద్దగా పట్టించుకోని ‘ఉపాధ్యాయ దినోత్సవం’ (సెప్టెంబర్ 5) ఈ సంవత్సరం ప్రధాని నరేంద్ర మోడి పుణ్యమాని ఓ పెద్ద చర్చాంశం అయింది. రాజకీయాలకు అతీతంగా నిస్పాక్షిక సంబరంగా ఇన్నాళ్లూ ఉంటూ వచ్చిన ఉపాధ్యాయ దినం ఇప్పుడు రాజకీయ ప్రకటనలకు వేదిక కావడమూ ప్రధాని మోడి పుణ్యమే. ‘చాయ్ పే చర్చా’ తరహాలో ప్రధాన మంత్రి స్వయంగా పిల్లలతో మాట్లాడుతారంటూ మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ…

మంత్రులు, నేతలు, విద్యార్హతలు -కార్టూన్

X: ఏయ్! కొట్టుకోవడం ఆపండి! Y: నాయకత్వానికి విద్యార్హతలు ఎవన్నా ఉండాలా లేదా అని చర్చించుకోవడానికే ఇది… X: అయితే ఓ.కె, మన (సోనియా) నాయకత్వం పైన అనుమానాలు వ్యక్తం చేయడానికేమో అనుకున్నాలేండి… ********* స్మృతి ఇరానీ పుణ్యమాని నాయకత్వం విద్యార్హతల గురించి ఆసక్తికరమైన చర్చ నడిచింది. నిజానికి ఈ చర్చకు స్మృతి ఇరానీ ప్రత్యక్ష కారణం కాదు. పరోక్ష కారణమే. ఆమెను మానవ వనరుల అభివృద్ధి శాఖకు మంత్రిగా ప్రధాని నరేంద్ర మోడి నియమించడంతో ఈ…