ఫైర్ బు(బా)ల్ తో ఆడుకునే ప్రాణాంతక సరదా -ఫోటోలు

‘ఎద్దు పుండు కాకికి ముద్దు’ అని సామెత. కొమ్ములకు అంటించిన మంటలు చెలరేగి పోతుంటే భయంతో పరుగులు తీసే ఎద్దుతో ఆడుకుంటూ  స్పానియార్డ్ లు పడే సరదా చూస్తే ‘ఇదేం ఆనందం’ అనిపించక మానదు. కొమ్ములు తిరిగిన భారీ ఎద్దులతో పోరాటాలకు దిగడం స్పానిష్ సంస్కృతిలో భాగం అని అందరికి తెలిసిన విషయమే. కానీ ఫైర్ బుల్ ఫెస్టివల్ (టోరో డి జుబిలో) పేరుతో స్పెయిన్ లో ఏటా జరిగే ప్రాణాంతక పండగ విషయం తెలిసింది తక్కువ…

స్పెయిన్ హోళీ ‘లా టొమాటినా’ -ఫోటోలు

పండుగలు ఎలా ప్రారంభం అవుతాయో తెలియజేసే పండగ స్పెయిన్ లో ఓ పట్టణం వారు జరుపుకునే ‘లా టొమాటినా’. వివిధ సంస్కృతుల మధ్య పైకి కనిపించని ఉమ్మడి ప్రవాహం ఉంటుందని కూడా ఈ పండగ తెలియజేస్తుంది. ఇటీవలే (1945) మొదలైనందున స్పెయిన్ ‘టమోటా యుద్ధం’ పండుగ మూలం ఏమిటో స్పష్టంగా రికార్డయింది. ఆగస్టు నెలలో చివరి బుధవారం నాడు జరుపుకునే ఈ పండుగ రోజున అక్కడ చేరిన జనం ఒక గంట పాటు టమోటాలు ఒకరిపై ఒకరు…

రికార్డులు తిరగ రాస్తున్న యూరోజోన్ నిరుద్యోగం

17 ఐరోపా దేశాల మానిటరీ యూనియన్ ‘యూరోజోన్’ నిరుద్యోగంలో తన రికార్డులు తానే తిరగ రాస్తోంది. ఉమ్మడి యూరో కరెన్సీ ఉనికిలోకి వచ్చిన గత 13 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా 12 శాతం నిరుద్యోగాన్ని నమోదు చేసింది. జనవరిలో 11.9 శాతంగా ఉన్న నిరీద్యోగ శాతం మరో 33,000 మంది ఉద్యోగాలు కోల్పోవడంతో ఫిబ్రవరిలో 12 శాతానికి పెరిగింది. ఐరోపా వ్యాపితంగా అధికారిక నిరుద్యోగుల సంఖ్య 1.91 కోట్లకు పై చిలుకేనని ఐరోపా గణాంక సంస్ధ…

స్పెయిన్ ఆయిల్ కంపెనీని జాతీయ చేసిన అర్జెంటీనా

– “ఇప్పటి నుండి మన ఆయిల్ రెస్పోల్ కంపెనీ అమ్ముకునే కమోడిటీ గా ఉనికిని ముగించుకుని దేశ అభివృద్ధి కోసం మౌలిక సరుకుగా ఉపయోగపడుతుంది”      -అర్జెంటీనా పాలక పార్టీ పార్లమెంటు సభ్యుడు ఆగస్టిన్ రొస్సీ అర్జెంటీనాలో అతి పెద్ద ఆయిల్ కంపెనీ వై.పి.ఎఫ్ ను ప్రభుత్వం జాతీయ చేసింది. వాణిజ్య ఆంక్షలు విధిస్తామన్న యూరోపియన్ యూనియన్ హెచ్చరికలను పెడచెవిన పెడుతూ, అర్జెంటీనా పార్లమెంటు అత్యధిక మెజారిటీతో వై.పి.ఎఫ్ జాతీయ కరణను ఆమోదించింది. వై.పి.ఎఫ్ లో స్పెయిన్ బహుళజాతి…

యూరప్ రుణ సంక్షోభంలో తదుపరి సమిధలు ఇటలీ, స్పెయిన్? -కార్టూన్

అమెరికా అప్పు వ్యవహారం గత రెండు మూడు నెలలది మాత్రమే. యూరప్ అప్పు సంక్షోభం ఒకటిన్నర సంవత్సరాలుగా నలుగుతోంది. గ్రీసుతో మొదలుకుని ఐర్లండ్, పోర్చుగల్ వరకూ యూరప్ అప్పు సంక్షోభం వ్యాపించింది. అంటే ఆ దేశాలకు సాధారణ స్ధాయిలో అప్పులు దొరికే పరిస్ధితి లేదు. దానితో ఆ దేశాలకు ఇతర యూరోజోన్ దేశాలు బెయిలౌట్ పేరుతో ఉమ్మడిగా రుణాలు ఇవ్వాల్సి వచ్చింది. ఈ మూడు దేశాల తర్వాత స్పెయిన్, ఇటలీలదే వంతు అని ఆర్ధిక పండితులు భావిస్తున్నారు.…

భారీ నష్టాల్లో షేర్ మార్కెట్, శుక్రవారం 400 పాయింట్ల పైగా పతనం

ఈ వారం చివరి వ్యాపార దినం అయిన శుక్రవారం భారీగా నష్టపోతున్నాయి. వ్యాపారం ప్రారంభమైన గంటలోపే 400 పాయింట్లకు పైగా బి.ఎస్.ఇ సెన్సెక్స్ నష్టపోయింది. ఇది దాదాపు 2.4 శాతానికి సమానం. బి.ఎస్.ఇ సెన్సెక్స్ 2.4 శాతం నష్టపోయి 17,268 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్.ఎస్.ఇ నిఫ్టీ కూడా 2.4 శాతం నష్టపోయి 5204 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. యూరప్ అప్పు సంక్షోభం స్పెయిన్, ఇటలీలకు పాకవచ్చునని అనుమానాలు విస్తృతం కావడం, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మరోసారి…

మే నెలలో మళ్ళీ క్షీణించిన భారత పారిశ్రామీక వృద్ధి, షేర్లు పతనం

భారత పారిశ్రామికీ వృద్ధి గత సంవత్సరం మే నెలతో పోలిస్తే ఈ సంవత్సరం మే నెలలో మళ్ళీ క్షిణించింది. మే నెలలో పారిశ్రామిక వృద్ధి 5.6 శాతంగా నమోదయ్యింది. రాయిటర్స్ సర్వేలో ఇది 8.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఈ క్షీణత అంచనాల కంటే ఎక్కువగా ఉండడం, ఇటలీ, స్పెయిన్ దేశాలు సావరిన్ అప్పు సంక్షోభానికి దగ్గర్లోనే ఉన్నాయన్న అనుమానాలు తీవ్రం కావడంతో భారత షేర్ మార్కెట్లు నష్టాల బాటలోనే మూడోరోజూ కొనసాగాయి. గత శుక్రవారం…

యూరోజోన్ సంక్షొభం భయాలతో కుప్పకూలిన భారత షేర్‌మార్కెట్లు

యూరప్ అప్పు సంక్షోభం భయాలు విస్తరించడంతో ప్రపంచ వ్యాపితంగా సోమవారం నాడు షేర్ మార్కెట్లు వణికిపోతున్నాయి. భారత షేర్ మార్కెట్లు దాదాపు రెండు శాతం నష్టపోయాయి. గ్రీసు అప్పు రేటింగ్‌ను ఫిచ్ రేటింగ్ సంస్ధ బాగా తగ్గించడం, ఇటలీ అప్పు రేటింగ్‌ను ఎస్ & పి రేటీంగ్ సంస్ధ నెగిటివ్ కి తగ్గించడంతో షేర్ మార్కెట్లలో అమ్మకాల వత్తిడి పెరిగింది. రేటింగ్ సంస్ధల చర్యలతో యూరో విలువ తగ్గింది. ఇప్పటికే గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాలు అప్పు…