అబ్బే మా మధ్య విభేదాలేమీ లేవు -కార్టూన్

– – “అబ్బే తేడాలేమీ లేవు. మేమిద్దరం కలిసే పని చేస్తున్నాం!” “మళ్ళీ మీ పనిలోకి దిగిపోయారా? రాజకీయాలను క్రీడలతో కలపొద్దు చెబుతున్నా!” కాంగ్రెస్ అధ్యక్షురాలు, యు.పి.ఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ ల మధ్య విభేదాలు తలెత్తాయని మళ్ళీ పత్రికలు గుస గుసలు మొదలు పెట్టాయి. అవినీతి ఆరోపణలతో పవన్ కుమార్ బన్సాల్, బొగ్గు కుంభకోణంలో విచారణ చేస్తున్న సి.బి.ఐ విధుల్లో జోక్యం చేసుకున్నందుకు సుప్రీం కోర్టు చేత అభిశంసనకు గురయినందుకు అశ్వనీ…

బి.సి.సి.ఐ మ్యాచ్ ఫిక్స్, ‘శ్రీ’నివాసన్ ఔట్?

ఆదివారం బి.సి.సి.ఐ బోర్డు అత్యవసర సమావేశం జరిపి అధ్యక్షుడు శ్రీనివాసన్ కు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కార్యదర్శి జగ్దాలే, ట్రెజరర్ అజయ్ షిర్కే ల రాజీనామాలతో శ్రీనివాసన్ పై ఒత్తిడి బాగా పెరిగినట్లు తెలుస్తోంది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటి పరిణామాలను కారణంగా చూపుతూ, ఐ.పి.ఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా శనివారం రాజీనామా చేయడంతో ఇక శ్రీనివాసన్ రాజీనామా దాదాపు ఖాయమేనని పత్రికలు చెప్పేస్తున్నాయి. అయితే రాజీనామాకు శ్రీనివాసన్ కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. తనకు…

మోడి నోరు తెరవరేమి? -కార్టూన్

— “కొద్దిగా మార్పులు చేసి వాటిని మీరు ఉపయోగించొచ్చు కదా!” — ఐ.పి.ఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం విషయంలో దాదాపు అందరూ ఏదో ఒక మాట అనేశారు. భావి ప్రధాని కావాలని ఆశిస్తున్న మోడి మాత్రం ఎందుకో ఇంకా నోరు తెరవలేదు! మోడి అటెన్షన్ కోరడానికి కారణం ఆయన కూడా బి.సి.సి.ఐ బోర్డు సభ్యుడు కావడమే. గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఆయన కూడా బి.సి.సి.ఐ బోర్డు సభ్యులే. అవడానికి క్రికెట్ ఆట బోర్డే అయినా దాని…

రెంటల్ మేన్స్ గేమ్ -కార్టూన్

ఐ.పి.ఎల్ కుంభకోణం గురించి పత్రికల్లో కార్టూన్ల వరద పారుతోంది. జెంటిల్మెన్ గేమ్ గా గొప్పలు చెప్పుకున్న గేమ్ కాస్తా రెంటల్మెన్ గేమ్ గా మారిపోయిందని కార్టూనిస్టు నవరే శ్రేయాస్ వినూత్న రీతిలో స్పష్టం చేస్తున్నారు. ఐ.పి.ఎల్ లో పాత్రధారులైన వివిధ సెక్షన్లకు కుంభకోణం దరిమిలా అది ఒక్కో కంటికి ఎలా కనిపిస్తోందో కార్టూనిస్టు విశ్లేషించారు. ఒక్కోక్కరికి ఒక్కో విధంగా కళ్ళు మూసుకుపోయాయని కూడా ఈ కార్టూన్ కి అర్ధం తీసుకోవచ్చు. ఆటగాళ్లకు డబ్బు తప్ప ఆట కనిపించడం…

చెన్నై టీం ఓనర్లే స్పాట్ ఫిక్సర్లు, పందెందార్లు

కలుగులో ఎలుక బైటికి వచ్చేస్తోంది. పోలీసులు పెట్టిన పొగ తట్టుకోలేక పుట్టలో పాములు వరుసగా తోసుకుని బైటికొస్తున్నాయి. విందూ దారా సింగ్ ఇచ్చిన వివరాలు నిజమేనని ముంబై పోలీసులకు స్పష్టంగా అర్ధం అయింది. స్పాట్ ఫిక్సింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బి.సి.సి.ఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు, ఇండియా సిమెంట్స్ కంపెనీ అధినేతల్లో ఒకరు అయిన గురునాధ్ మీయప్పన్ పాత్ర ఉన్నదని ముంబై పోలీసుల వద్ద సరిపోయినన్ని సాక్ష్యాలు ఉన్నాయట. ఈ మేరకు ముంబై జాయింట్…

ఐ.పి.ఎల్ ఫిక్సింగ్: విందూ, చెన్నై యజమాని పందెందారు

చనిపోయిన మాజీ నటుడు దారాసింగ్ తనయుడు విందూ దారా సింగ్, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బి.సి.సి.ఐ కార్యదర్శి శ్రీనివాసన్ అల్లుడు గురునాధ్ మీయప్పన్ తరుపున అనేకసార్లు పందెం కాసినట్లు తెలుస్తోంది. మీయప్పన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సి.ఐ.ఓ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) కూడా. అనేకమంది ప్రముఖుల పేర్లను కూడా విందూ సింగ్ చెన్నై పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అనేకమంది సినిమా తారలు, పేరు మోసిన మాజీ క్రికెటర్, ప్రస్తుతం కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ప్రముఖ మాజీ…

పిల్ల ఫిక్సింగ్ ముఠా అణచివేతలో భాగంగా శ్రీశాంత్ బుక్కయ్యాడా?

ఈనాడు పత్రిక ప్రకారం క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ లు, స్పాట్ ఫిక్సింగ్ లు అన్నీ కలుపుకుని ఈసారి చేతులు మారిన మొత్తం అక్షరాలా రు. 47,000 కోట్లు. ఇది గత సంవత్సరం రు. 43,000 కోట్లట. అంటే 2జి, బొగ్గు కుంభకోణాలను తలదన్నే మొత్తాలు క్రికెట్ ఫిక్సింగ్ వ్యాపారంలో ఇమిడి ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తాల్లో శ్రీశాంత్, చండీలా, చవాన్ లకు అందింది కోటి రూపాయలకు మించలేదు. మరి మిగిలిన మొత్తం ఎవరి చేతులకు చేరినట్లు, ఎవరి…

క్రికెట్ ధన యజ్ఞంలో సమిధలు ఆటగాళ్లు

కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ లో దొరికిపోయాడు. అతనితో పాటు రాజస్ధాన్ రాయల్స్ కి చెందిన మరో ఇద్దరు ఆటగాళ్లను ఢిల్లీ పోలీసులు గురువారం తెల్లవారు ఝామున అరెస్టు చేయడంతో ఐ.పి.ఎల్ స్పాట్ ఫిక్సింగ్ విషయాలు బైటికి వచ్చాయి. ఏప్రిల్ నుండే తాము ఆటగాళ్ల పైనా, బుకీల పైనా నిఘా పెట్టామని వారిని తప్పులు చేయనిచ్చి అరెస్టు చేశామని పోలీసులు సగర్వంగా, సంచలనాత్మకంగా ప్రకటించారు. జాతీయ జట్టు కెప్టెన్ ధోనీయే కుట్ర చేసి తమ…