‘స్పామ్ ఈ మెయిల్స్’ లో ఇండియాదే అగ్ర స్ధానం
పనికిరాని ‘స్పామ్ ఈ మెయిల్స్’ పంపడంలో భారత దేశం అగ్ర స్ధానం ఆక్రమించిందని కంప్యూటర్ సెక్యూరిటీ సంస్ధ ‘సోఫోస్’ తెలిపింది. అమెరికాని రెండో స్ధానంలోకి నెట్టి భారత దేశం అగ్ర స్ధానానికి చేరిందని ఆ సంస్ధ తెలిపింది. అయితే ఇందులో భారతీయుల తప్పేమీ లేదు. మొదటిసారి ఇంటర్నెట్ వినియోగిస్తున్న భారతీయులకు ఈ మెయిల్ వినియోగంలో అనుభవం లేకపోవడమే దీనికి కారణమని ‘సోఫోస్’ తెలిపింది. సోఫోస్ సంస్ధ స్పామ్ మెయిళ్ళు అధికంగా వచ్చే కంప్యూటర్ల సంఖ్య ఆధారంగా వివిధ…