స్నోడెన్ వస్తే అమెరికాకి అప్పగించం -స్విస్ మీడియా

అమెరికా గూఢచర్యంపై సాక్ష్యం ఇవ్వడానికి స్నోడెన్ తమ దేశం వస్తే ఆయనను అమెరికాకు అప్పగించకపోవచ్చని  స్విట్జర్లాండ్ మీడియా కధనాలు ప్రచురిస్తోంది. ఈ మేరకు స్విట్జర్లాండ్ అటార్నీ జనరల్ స్విస్ ప్రభుత్వానికి ఒక పత్రం సమర్పించారని సోన్టాగ్స్ జీటంగ్ (స్విస్) పత్రికను ఉటంకిస్తూ రష్యా టుడే (ఆర్.టి) పత్రిక తెలిపింది. అయితే ప్రభుత్వంలో ఉన్నత స్ధాయిలో దానికి విరుద్ధంగా హామీ ఇస్తే చెప్పలేమని అటార్నీ జనరల్ చెప్పినట్లు తెలుస్తోంది. అనగా స్విస్ మీడియా అంచనాకు భిన్నంగా స్నోడెన్ రక్షణకు…

ఆస్ట్రేలియా గూఢచర్యం: రాయబారిని వెనక్కి పిలిచిన ఇండోనేషియా

అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు సాగిస్తున్న గూఢచర్యం పై ఎలా స్పందించాలో ఇండోనేషియా ఒక ఉదాహరణ చూపింది. తమ అధ్యక్షుడి టెలిఫోన్ సంభాషణలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిఘా పెట్టిందన్న విషయం స్నోడెన్ పత్రాల ద్వారా వెలుగులోకి వచ్చిన రోజే ఆ దేశం నుండి తమ రాయబారిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాతో తాము కుదుర్చుకున్న స్నేహ, సహకార ఒప్పందాలు అన్నింటినీ సమీక్షిస్తున్నట్లు కూడా ఇండోనేషియా ప్రకటించింది. అమెరికా గూఢచర్యం అసలు గూఢచర్యమే కాదు పొమ్మన్న భారత పాలకులతో…

ఏంజెలా ఫోన్ ట్యాపింగ్: సాక్ష్యానికి స్నోడెన్ రెడీ

జర్మనీ ఛాన్సలర్ సెల్ ఫోన్ సంభాషణలపై అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ గూఢచర్యం నిర్వహించిందన్న ఆరోపణలపై అమెరికా – జర్మనీల మధ్య వాదోపావాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సాక్ష్యం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎన్.ఎస్.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్, జర్మనీ ప్రభుత్వానికి తెలిపాడు. అమెరికా వ్యతిరేక కార్యకలాపాలకు స్వస్తి పలకాలన్న షరతు మీద స్నోడెన్ కి రాజకీయ ఆశ్రయం ఇచ్చినప్పటికీ అమెరికా – జర్మనీల మధ్య మరింత దూరం పెంచే అవకాశాన్ని…

అబద్ధాలాడొద్దు! -అమెరికాతో జర్మనీ

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా సెల్ ఫోన్ సంభాషణలను తాము వినడం లేదన్న అమెరికా వాదనను జర్మనీ కొట్టిపారేసింది. ‘అబద్ధాలాడొద్దు’ అని కసిరినంత పని చేసింది. తమ ఛాన్సలర్ ఫోన్ సంభాషణలను అమెరికన్లు వింటున్నారని చెప్పడానికి తమ వద్ద ‘నూతన సాక్ష్యాలు’ ఉన్నాయని తేల్చి చెప్పింది. జర్మనీ చట్టాలను ఉల్లంఘించడం లేదని చెబుతున్న ఎన్.ఎస్.ఏ వాస్తవం చెప్పడం లేదని జర్మనీ ఛాన్సలర్ వ్యవహారాల మంత్రి రొనాల్డ్ పొఫల్లా తెలిపారు. అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అనేక దేశాల అధినేతల…

స్నోడేన్ పత్రాలు: హార్డ్ డిస్క్ సహా అమెరికా గుప్పిట్లో ఇండియా జాతకం 2

మొదటి భాగం తరువాత……… కొమింట్ పత్రంలోని వివరాలు భయంకరమైన నిజాలని మనముందు ఉంచాయని ది హిందూ పత్రిక వ్యాఖ్యానించింది. మన్ హట్టన్ (న్యూయార్క్) లోని ఐరాస భారత శాశ్వత కార్యాలయం ఎన్.ఎస్.ఏ టాప్ టార్గెట్లలో ఒకటి. ఇక్కడ ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, ఉప శాశ్వత ప్రతినిధి, ఒక మంత్రి, ఒక రాజకీయ సమన్వయకర్త, ఆరుగురు కౌన్సిలర్లు, ఒక కల్నల్ ర్యాంకులోని మిలట్రీ సలహాదారు, ఇంకా ప్రపంచ దేశాలతో ఇండియాకు ఉండే వివిధ సంబంధాలకు సంబంధించిన అనేకమంది…

హార్డ్ డిస్క్ సహా ఇండియా జాతకం అమెరికా గుప్పిట్లో -స్నోడేన్ పత్రాలు -1

అమెరికా నీతిమాలిన గూఢచర్యం గురించి కళ్ళు తిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇండియా తనకు ఎంతో కావలసిన మిత్రుడు అని ప్రపంచానికి చాటే అమెరికా, తన గడ్డపై (వాస్తవానికి అది రెడ్ ఇండియన్ల గడ్డ)  ఇండియాకు సంబంధించి ఏ కార్యాలయాన్నీ గూఢచర్యం నుంచి మినహాయించలేదు. చివరికి, భారత దేశం యొక్క ప్రపంచ స్ధాయి దౌత్య కార్యకలాపాలకు గుండెకాయ లాంటివి అయిన న్యూయార్క్ లోని ఐరాస శాశ్వత భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ డి.సి లోని భారత ఎంబసీ…