అమెరికా ‘నేషనల్ స్పెల్లింగ్ బీ’ ఛాంపియన్ తెలుగమ్మాయి

అమెరికా లో నిర్వహించే ప్రఖ్యాత ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ ఛాంపియన్ షిప్ ను ఈసారి తెలుగమ్మాయి ‘స్నిగ్ధ నందిపాటి’ గెలుచుకుంది. ప్రవాస భారతీయులు ఈ ట్రోఫీ గెలుచుకోవడం ఇది వరుసగా అయిదవసారి కావడం గమనార్హం. గత 14 సంవత్సరాలలో పది సార్లు ప్రవాస భారతీయులే ఈ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారని ‘ది హిందూ’ తెలిపింది. తొమ్మిది మంది ఫైనలిస్టులలో అగ్రస్ధానం పొందిన స్నిగ్ధ 30,000 డాలర్ల (దాదాపు 16.5 లక్షల రూపాయలు) ప్రైజ్ మనీతో పాటు…