స్ట్రాన్ కాన్ పై మరొక రేప్ కేసు, ఎనిమిదేళ్ళనాటి పాపం వెంటాడిన ఫలితం

ఐ.ఎం.ఎఫ్ మాజీ అధ్యక్షుడు డొమినిక్ స్ట్రాస్ కాన్ స్వదేశం ఫ్రాన్సులో మరొక రేప్ కేసు ఎదుర్కొంటున్నాడు. న్యూయార్క్ లోని ఒక లగ్జరీ హోటల్ మెయిడ్ పై అత్యాచారానికి ప్రయత్నించాడని ఆరోపణలు రావడంతో స్ట్రాస్ కాన్ ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. అయితే రేప్ నేరం ఆరోపించిన మహిళ తన వివరాల గురించి అబద్ధాలు చెప్పిందనీ, రేప్ ప్రయత్నం జరిగిన తర్వాత తాను చేసిన ఫోన్ కాల్స్ పై కూడా అబద్ధాలు చెప్పిందనీ…