‘యాపిల్’ సారధి ‘స్టీవ్ జాబ్స్’ అస్తమయం

యాపిల్ కంపెనీకే సాధ్యమైన ప్రత్యేక ఉత్పత్తులతో ప్రపంచ టెక్నాలజీ అభిమానులను ఉత్తేజపరిచిన స్టీవ్ జాబ్స్ 56 ఏళ్ళ వయసులో తనువు చాలించాడు. చాలా కాలంగా ‘పాంక్రియటిక్ కేన్సర్’ తో బాధపడుతున్న గత ఆగస్టు నెలలోనే యాపిల్ కంపెనీ సి.ఇ.ఓ పదవినుండి తప్పుకుని ఛైర్మన్ గా మిగిలాడు. యాపిల్ కంపెనీ ‘ఐ ఫోన్ 4ఎస్’ ని విడుదల చేసిన తర్వాత రోజే స్టీవ్ చనిపోవడం యాదృచ్ఛికమే కావచ్చు. కాలిఫోర్నియా రాష్ట్రంలో పాలో ఆల్టో పట్టణంలో స్టీవ్ జాబ్స్ చనిపోయినపుడు…