ఒట్టావాలో టెర్రర్ -ది హిందు ఎడిటోరియల్

ఉగ్రవాదానికి కెనడా కొత్తది ఏమీ కాదు. ఆ దేశ పార్లమెంటుపై దాడి గతంలో ఎన్నడూ ఎరగనట్టిదిగా కనిపించవచ్చు గానీ -కెనడా అమాయకత్వపు ముగింపుగా కూడా దాడిని అభివర్ణించారు- ఉగ్రవాదంతో ఆ దేశానికి, మరే ఇతర పశ్చిమ దేశం కంటే ముందునుండీ, సుదీర్ఘ అనుభవమే ఉంది. 1970లో క్విబెక్ లిబరేషన్ ఫ్రంట్ (ఎఫ్.ఎల్.క్యూ) బ్రిటిష్ దౌత్యవేత్తను, కెనడియన్ కార్మిక మంత్రిని కిడ్నాప్ చేసి రెండున్నర నెలలపాటు తన అదుపులో ఉంచుకుంది. అప్పటి ప్రధాన మంత్రి పియర్రే ట్రుడ్యూ క్విబెక్…