ఫ్లేమ్: సైబర్ హై వే పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -3

ఇరానియన్ అణు శుద్ధి కేంద్రం ‘నటాంజ్’ లో స్టక్స్ నెట్ వైరస్ సృష్టించిన విధ్వంసం వెల్లడయిన రెండేళ్ల తర్వాత ‘ఫ్లేమ్’ అనే మరో వైరస్ గురించి కంప్యూటర్ నిపుణులు బయటపెట్టారు. ప్రధానంగా ఇరాన్ పై ప్రయోగించబడిన ఫ్లేమ్ ఫైరస్ ఇజ్రాయెల్ తో పాటు, మధ్య ప్రాచ్యంలోని ఇరాక్, సౌదీ అరేబియా, ఇంకా మరికొన్ని చోట్ల కూడా కనుగొన్నామని నెల క్రితం వారు తెలిపారు. ఫ్లేమ్ ఫైరస్ కూ స్టక్స్ నెట్ వైరస్ కూ అనేక పోలికలు ఉన్నాయనీ…

‘సైబర్ హై వే’ పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -2

– ‘నటాంజ్’ లో అండర్ గ్రౌండ్ లో శత్రు దుర్బేధ్యంగా నిర్మించబడిన ఇరాన్ అణు శుద్ధి కేంద్రంలోని కంప్యూటర్లను స్వాధీనంలోకి తెచ్చుకోవడమే ‘సైబర్ ఆయుధం’ లక్ష్యం. నటాంజ్ కర్మాగారంలో పారిశ్రామిక కంప్యూటర్ కంట్రోల్స్ లోకి జొరబడగలిగితే అణు శుద్ధి కార్యకలాపాలను విధ్వంసం చేయవచ్చన్నది పధకమని ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. అలా జొరబడాలంటే ఇంటర్నెట్ నుండి నటాంజ్ ప్లాంటును వేరు చేసే ఎలక్ట్రానిక్ కందకాన్ని దాటాల్సి ఉంటుంది. టైమ్స్ సమాచారం ప్రకారం నటాంజ్ ప్లాంటును బైటి ప్రపంచం నుండి…

స్టక్స్ నెట్, ఫ్లేమ్: ‘ఇంటర్నెట్ హై వే’ పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -1

‘నూనం-మానం, సిగ్గు-లజ్జ, చీము-నెత్తురు, నీతి-నియమం’ ఇలాంటివేవీ తాము ఎరగమని అమెరికా పాలక వ్యవస్ధ మరోసారి చాటుకుంది. ‘అమెరికా ఎంతకైనా తెగిస్తుంది’ అని చాటుకోవడంలో అమెరికా అధ్యక్షులు మినహాయింపు కాదని అమెరికా పత్రికలే నిర్ద్వంద్వంగా ఇంకోసారి తేల్చి చెప్పాయి. ఇరాన్ దేశ కంప్యూటర్లపై దాడి కోసం ‘కంప్యూటర్ వైరస్’ లను సృష్టించి, దుర్మార్గమైన ‘సైబర్ వార్’ కి తెర తీయడం వెనుక అమెరికా అధ్యక్షుడు ‘బారక్ ఒబామా’ ప్రత్యక్ష అనుమతి ఉందని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక వెల్లడి చేసింది.…

“స్టక్స్ నెట్” వైరస్ సృష్టికర్తలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే -పరిశోధకులు

ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడానికి అమెరికా, దేశాలు “స్టక్స్ నెట్” కంప్యూటర్ వైరస్ సృష్టించారని సెక్యూరిటీ నిపుణుడు రాల్ఫ్ లాంగ్నర్ తేల్చాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఒక కార్ఫెన్స్ లో మాట్లాడుతూ లాంగ్నెర్ ఈ విషయం వెల్లడించాడు. ఈ వైరస్ సృష్టించడంలో చోదక శక్తి మాత్రం అమెరికా అని ఆయన చెప్పాడు. ఇజ్రాయెల్ సహాయంతో అమెరికా ఈ వైరస్ ను ఇరాన్ లో అణు ఇంధనాన్ని శుద్ధి చేయడానికి వినియోగించిన కంప్యూటర్ వ్యవస్ధను నాశనం చేయడానికి సృష్టించిందని…