చలి మంచు క్రీడల ఆనందమే వేరు! -ఫోటోలు

పెద్దగా శ్రమ పదకుండా చెక్క (లేదా ప్లాస్టిక్) పలకలపై నిలబడి వందల మీటర్ల దూరం జారుతూ పోవడాన్ని ఎవరు ఇష్టపడరు గనక? మంచు కప్పేసిన ఏటవాలు కొండ తలాలపై ప్రమాదకరంగా స్కీయింగ్ చేయడం పశ్చిమ దేశాల్లో మామూలు విషయం అనుకుంటా. చలికాలం తెచ్చి పడేసిన మంచు ప్రజా జీవనానికి ఒక కోణంలో ఇబ్బంది కలిగించినప్పటికీ ప్రతి యేడూ మంచు కురవడం సాధారణ వాస్తవం అయినప్పుడు ఆ ఇబ్బందిని అధిగమించే ఆటలు పుట్టుకోస్తాయి కాబోలు!  స్కీయింగ్, ఐస్ హాకీ…