రిఫరెండం పూర్తైనా స్కాట్లండ్ భారమే -కార్టూన్

సెప్టెంబర్ 18 తేదీన జరిగిన రిఫరెండంలో యు.కెలో భాగంగా ఉండడానికే మెజార్టీ స్కాట్లండ్ ప్రజలు (55%)నిర్ణయించారు. రిఫరెండంలో విడిపోవడానికే స్కాట్ లు నిర్ణయిస్తారని భయపడిన యు.కె రాజకీయ పార్టీలు ఫలితాలతో ఊపిరి పీల్చుకున్నారు. యు.కెలో కొనసాగడానికే స్కాట్ ప్రజలు నిర్ణయించుకున్నప్పటికీ యునైటెడ్ కింగ్ డమ్ స్కాట్లండ్ భారం కొనసాగుతూనే ఉందని కార్టూన్ సూచిస్తోంది. అది నిజమే. ఎందుకంటే స్కాట్లండ్ రిఫరెండం దగ్గరపడే కొద్దీ స్కాట్లండ్ స్వతంత్రానికి ఆదరణ పెరుగుతూ పోయింది. చివరి రోజుల్లో ఇరు పక్షాలు సమాన…

స్టెర్లింగ్ చావుకొచ్చిన స్కాట్లండ్ సంబరం

‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అని సామెత. యునైటెడ్ కింగ్ డమ్ (గ్రేట్ బ్రిటన్) కరెన్సీ పరిస్ధితి ఇప్పుడు అలానే ఉంది. స్కాట్లండ్ స్వతంత్రం పట్ల స్కాటిష్ ప్రజల్లో ఆదరణ పెరిగేకొద్దీ బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ దిగజారుతోంది. ఆదివారం జరిగిన అభిప్రాయ సేకరణలో స్కాట్లండ్ ప్రత్యేక దేశంగా విడిపోవడానికి ‘యెస్’ అంటున్న ఓటర్ల సంఖ్య మొదటిసారిగా మెజారిటీ సాధించినట్లు తేలింది. ఓటింగులో పాల్గొన్నవారిలో అటో, ఇటో చెప్పినవారిలో 51 శాతం మంది ‘యెస్’ అని…

స్కాట్లండ్ రిఫరెండం: ‘యెస్’ కు పెరుగుతున్న ఆదరణ

స్కాట్లండ్ రిఫరెండం దగ్గర పడేకొద్దీ బ్రిటన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. స్కాట్లండ్ స్వతంత్రాన్ని కోరేవారు రోజు రోజుకీ పెరుగుతుండమే దానికి కారణం. ఆర్ధిక కారణాలు, చారిత్రక కారణాలు, బెదిరింపులు, బుజ్జగింపులు… ఇలా ఎన్ని ఆశలు పెడుతున్నా యెస్ వోటు పెరుగుతుండగా నో వోటు తగ్గిపోతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. ఫలితంగా ఇంగ్లండ్ పాలకుల్లో గుబులు బయలుదేరింది. స్కాట్లండ్ స్వతంత్రాన్ని వ్యతిరేకిస్తున్న కార్పొరేట్ పత్రికలు సైతం ఆందోళన ప్రకటిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇంగ్లండ్ నేతృత్వంలోని యునైటెడ్ కింగ్…

స్కాట్లండ్ రిఫరెండం: యు.కె పాచిక ‘పౌండ్’

పౌండ్ స్టెర్లింగ్ ను కరెన్సీగా వదులుకోవాల్సి వస్తే స్కాట్లండ్ కొత్త కరెన్సీని ఏర్పాటు చేసుకోవడం గానీ లేదా యూరో జోన్ లో చేరడం ద్వారా యూరోను కరెన్సీగా చేసుకోవడం గానీ చేయాల్సి ఉంటుంది. అయితే స్కాట్లండ్ నేతలు యూరో జోన్ లో చేరడానికి సిద్ధంగా లేరు. యూరోపియన్ యూనియన్ లో ఒక స్వతంత్ర సభ్య దేశంగా ఉండడానికి మాత్రమే వారు మొగ్గు చూపుతున్నారు. కానీ పౌండ్ కరెన్సీని కోల్పోయినట్లయితే స్కాట్లండ్ ఆర్ధిక వ్యవస్ధ కొన్ని ఆర్ధిక కుదుపులను…