ఇప్పుడు అమెరికాకి నెం.1 టార్గెట్, వెనిజులా -హాలీవుడ్ దర్శకుడు

అమెరికా ప్రభుత్వానికి, అమెరికా మీడియాకి ఇపుడు వెనిజులా నెంబర్ 1 టార్గెట్ అని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు అలివర్ స్టోన్ వ్యాఖ్యానించాడు. 2009లో హ్యూగో ఛావెజ్ పై ‘సౌత్ ఆఫ్ ద బోర్డర్’ అనే డాక్యుమెంటరి నిర్మించి ఛావెజ్ గురించిన వాస్తవాలను/అవాస్తవాలను అమెరికా ప్రజలకు తెలియజేసేందుకు ఆలివర్ స్టోన్  ప్రయత్నం చేశాడు. తన సినిమా ప్రత్యేక స్క్రీనింగ్ సందర్భంగా చనిపోయిన ఛావెజ్ పశ్చిమ వార్తా పత్రికలు, ప్రభుత్వాలు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని దుయ్యబట్టాడు. వెనిజులా ప్రజలు అత్యధిక మెజారిటీతో…