భాష, సోషలిజం, ప్రజాస్వామ్యం – పరస్పర సంబంధాలు -1

సోషలిజం, ప్రజాస్వామ్యంల మధ్య సంబంధాల గురించి నేను గతంలో రాసిన కొన్ని అంశాలపై కొంతమంది బ్లాగర్లు వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పటికే పలుమార్లు, పలుచోట్ల వారి సంస్కార రాహిత్యాన్ని బైట పెట్టుకున్నారు గనక వారి వ్యంగ్యాన్ని పక్కనబెడుతున్నా. వారి విమర్శనాంశాన్ని మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటూ దానికి మరికొంత వివరణ ఇవ్వడానికి ఈ టపాని ఉద్దేశించాను. ఈ అంశంపైన ఎక్కువమంది అయోమయానికి గురయ్యే అవకాశం ఉన్నందున ఈ ప్రయత్నం చేస్తున్నాను. కమ్యూనిస్టు పదజాలం ఏ యిజానికీ సొంతం…