#పోబిడ్డామోడి! -కేరళీయుల తిరస్కారం

‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు’ అని సామెత. ‘కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది’ ఇది కూడా సామెతే. 2014 సాధారణ ఎన్నికల్లో మొదటి సారి సంపూర్ణ మెజారిటీతో బి‌జే‌పిని అధికారంలోకి తెచ్చే వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మొదటి సామెతలో లబ్ది పొందారు. అధికారం చేపట్టాక మోడి దశ తిరిగినట్లే పరిణామాలు జరుగుతున్నాయి. 28 సీట్లు గెలిచిన ఢిల్లీ అసెంబ్లీలో రెండంటే రెండే సీట్లు దక్కించుకుని అతి చిన్న ఏ‌ఏ‌పి పార్టీ…

హృదయం ద్రవించుకుపోయే కీన్యా మాల్ రక్తపాతం -ఫోటోలు

కీన్యా రాజధాని నైరోబిలోని ‘వెస్ట్ గేట్ మాల్’ పైన నాలుగు రోజుల పాటు జరిగిన రక్తపాతం నాగరిక ప్రపంచాన్ని నిశ్చేష్టుల్ని చేసింది. ఆల్-ఖైదా అనుబంధ సంస్ధ అయిన ఆల్-షబాబ్, ఈ దాడికి తానే బాధ్యురాలినని ప్రకటించింది. దాడిలో 61 మంది సాధారణ పౌరులు చనిపోగా ఇంకా 63 మంది జాడ తెలియలేదు. చనిపోయినవారిలో కిన్యా అధ్యక్షుడు కీన్యెట్టా రక్త సంబంధీకులు కూడా ఉన్నారు. ఆల్-షబాబ్ టెర్రరిస్టులు విసిరిన గ్రెనేడ్ల ధాటికి నాలుగు అంతస్ధుల మాల్ లోని మూడు…