అరుణాచల్: కాంగ్రెస్ మాస్టర్ స్ట్రోక్! 

అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం పోగొట్టుకోవటం ఇక లాంఛనప్రాయమే అనుకున్నారు అందరూ. చీలిక వల్ల ఆ పార్టీకి మెజారిటీ లేదు. కాస్త సమయం తీసుకుని చీలిన ఎమ్మెల్యేలను సొంత గూటికి రప్పిద్దాం అన్న లక్ష్యంతో బల నిరూపణకు సమయం కోరితేనేమో గవర్నర్ లేదు పొమ్మన్నారు. ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో బలం నిరూపించుకోలేక ముఖ్యమంత్రి నబామ్ టుకి రాజీనామా సమర్పించటమే తరువాయి, అని అంతా భావించారు. “ఆపరేషన్ సక్సెస్,…

సోనియా అంటే మోడీకి భయం -కేజ్రీవాల్

అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణం విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆం ఆద్మీ పార్టీ ఈ రోజు ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు. ఏ‌ఏ‌పి నేతలు అనేకమంది పాల్గొన్న ఈ ర్యాలీని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. వందల మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ర్యాలీకి ముందుగా జరిగిన బహిరంగ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు. ప్రసంగంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఉబుసుబోక ప్రసంగాలను నిలువునా చీరేశారు.…

అగస్టా ఛాపర్: సోనియాను ఇరికించే మాయోపాయం?

4 రాష్ట్రాల ఎన్నికలు జనానికి ముఖ్యంగా పత్రికల పాఠకులకు, చానెళ్ల వీక్షకులకు గడ్డు రోజులు తెచ్చి పెట్టాయి. ఎన్నికల ప్రచారం అంటే ప్రజలు తమ ఎంపిక కోసం తమ ముందు ఏ యే అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవడం. ఇలాంటి అవకాశాలను ప్రజల ముందు ఉంచే పంధా నుండి రాజకీయ పార్టీలు ఎప్పుడో తప్పుకోవడం ఎన్నికల ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న అదనపు సమస్య. ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంలో వారి చేతుల్లో ఉన్న ఒక ప్రధాన…

రాహుల్ పునరాగమనం -ది హిందు ఎడిటోరియల్

[ఏప్రిల్ 21 తేదీన ది హిందూలో ప్రచురించిన ‘Return of Rahul’ సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం.] దాదాపు రెండు నెలల పాటు సెలవు రాహుల్ గాంధీ సెలవులో వెళ్లిపోవడం సరైన సమయంలో జరిగిన పరిణామమో ఏమో గానీ ఆదివారం నాడు ఢిల్లీలో భూ సేకరణ చట్టం (సవరణలు) కు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ర్యాలీ మాత్రం కాంగ్రెస్ పార్టీని మరింత చురుకైన ప్రతిపక్షంగా నిలబెట్టినట్లు కనిపిస్తోంది. నిరసనలకు ప్రారంభ ఊపు ఇచ్చింది రైతుల గ్రూపులు, పౌర…

సోనియా మరియు విదూషక నట్వర్ సింగ్ -కార్టూన్

యు.పి.ఏ-1 ప్రభుత్వంలో విదేశీ మంత్రిగా పని చేసి తొలగింపుకు గురయిన నట్వర్ సింగ్ పుస్తకం ప్రస్తుతం జాతీయ స్ధాయి చర్చల్లో నలుగుతోంది. ‘ఒక జీవితం చాలదు: ఆత్మకధ’ టైటిల్ తో ఈ రోజు వెలువడుతున్న పుస్తకం ఆయన సన్నిహితంగా మెలిగిన సోనియాపై విమర్శలు గుప్పించడంతో పత్రికలకు మేత లభించినట్లయింది. సోనియా చెప్పుకున్నట్లు అంతరాత్మ ప్రభోదం మేరకు ఆమె ప్రధాని పదవిని వదులుకోలేదని వాస్తవానికి ఆమె కుమారుడు రాహుల్ గాంధీ నిరోధించడం వల్లనే ఆమె పదవిని త్యజించారని నట్వర్…

మంత్రులు, నేతలు, విద్యార్హతలు -కార్టూన్

X: ఏయ్! కొట్టుకోవడం ఆపండి! Y: నాయకత్వానికి విద్యార్హతలు ఎవన్నా ఉండాలా లేదా అని చర్చించుకోవడానికే ఇది… X: అయితే ఓ.కె, మన (సోనియా) నాయకత్వం పైన అనుమానాలు వ్యక్తం చేయడానికేమో అనుకున్నాలేండి… ********* స్మృతి ఇరానీ పుణ్యమాని నాయకత్వం విద్యార్హతల గురించి ఆసక్తికరమైన చర్చ నడిచింది. నిజానికి ఈ చర్చకు స్మృతి ఇరానీ ప్రత్యక్ష కారణం కాదు. పరోక్ష కారణమే. ఆమెను మానవ వనరుల అభివృద్ధి శాఖకు మంత్రిగా ప్రధాని నరేంద్ర మోడి నియమించడంతో ఈ…

విభజన గోతిలో కాంగ్రెస్, ఒడ్డున కె.సి.ఆర్ -కార్టూన్

విభజన కోసం అహోరాత్రాలు శ్రమించిన కాంగ్రెస్ ను గోతిలోనే వదిలేసి విభజన ఫలాలను తాను మాత్రమే అందుకోవడం కోసం కె.సి.ఆర్ ప్రయత్నిస్తున్నారని కార్టూన్ సూచిస్తోంది. ఒడ్డు చేరేదాకా పడవ మల్లయ్య, ఒడ్డు చేరాక బోడి మల్లయ్య అయినట్లు! తెలంగాణ ఇస్తే టి.ఆర్.ఎస్ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తానని కె.సి.ఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనానికి కార్యకర్తలు ఒప్పుకోవడం లేదని కె.సి.ఆర్ ఇప్పుడు చెబుతున్నారు. కనీసం పొత్తుకి కూడా ఆయన అంగీకరించేట్లు లేరని కొన్ని పత్రికలు చెబుతున్నాయి.…

సోనియా చెయ్యి కట్టేసిన కె.సి.ఆర్? -కార్టూన్

తెలంగాణ ఇస్తే టి.ఆర్.ఎస్ ని కాంగ్రెస్ లో కలిపేస్తానని హామీ ఇచ్చిన కె.సి.ఆర్ ఇప్పుడు మొండి చెయ్యి చూపుతున్నట్లు ఈ కార్టూన్ సూచిస్తోందా? కానీ విలీనం చర్చలు జరుగుతున్నాయని నేడో, రేపో నిర్ణయం వచ్చేస్తుందని కదా పత్రికలు చెబుతున్నది? సోనియా ముందు టి.ఆర్.ఎస్ నేతలు ఒక వాదన ఉంచినట్లు కొద్ది రోజుల క్రితం ఒక ఊహాగానం వెలువడింది. దీని ప్రకారం విలీనం కంటే కలిసి పోటీ చేస్తేనే ఎక్కువ ఉపయోగం అని టి.ఆర్.ఎస్ నేతలు కాంగ్రెస్ కు…

తెలంగాణ సోనియా వంటకమా? -కార్టూన్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం సోనియా చేతుల్లోనే ఉందన్నట్లుగా అనేకమంది అభిప్రాయపడడం ఏమిటో అర్ధం కాకుండా ఉంది. తెలంగాణ ప్రజల ఆందోళన, ఆకాంక్షలు, చరిత్ర… ఇవేవీ లేకుండానే కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం, చిత్రించడం అమాయకత్వమా, అజ్ఞానమా, మిడి మిడి జ్ఞానమా? వివిధ పార్టీల నేతలు ఇరుకు స్వభావంతో, స్వార్ధ ప్రయోజనాల కోసం అంతా సోనియాయే చేస్తున్నట్లు చెబితే చెప్పొచ్చు గాక! సోనియా వల్లనే…

విధానాల్లో తేడా లేదు, ఇక మిగిలింది బురద జల్లుడు -కార్టూన్

సోనియా ఎన్నికల హెచ్చరిక: బి.జె.పికి వేసే ఓటు మీ ఆరోగ్యాన్ని విషపూరితం చేస్తుంది. మోడి ఎన్నికల హెచ్చరిక: కాంగ్రెస్ కి వేసే ఓటు మీ ఆరోగ్యాన్ని విషపూరితం చేస్తుంది. *** ఎల్.కె.అద్వానీ కొన్ని వారాల క్రితం ఓ మాటన్నారు. ఇప్పుడిక దేశంలో రెండే రాజకీయ శిబిరాలున్నాయని వాటికి నాయకులు కాంగ్రెస్, బి.జె.పిలని ఆయన మాట సారాంశం. గతంలో కాంగ్రెస్ కి ప్రత్యామ్న్యాయమ్ ఉండేది కాదనీ అలాంటి పరిస్ధితుల్లో ప్రత్యామ్నాయం స్ధాయికి బి.జె.పిని అభివృద్ధి చేశానని ఆయన చెప్పుకోదలిచారు.…

ఎలాగైతేనేం, ప్రధానీ నెంబర్ 1 అయ్యారు! -కార్టూన్

భారత దేశంలో అత్యున్నత అధికార పీఠం ప్రధాన మంత్రి పదవి. రాష్ట్రపతిని ప్రధమ పౌరుడిగా చెప్పినా రాజ్యాంగం ఆయన చేతుల్లో అధికారాలు ఏమీ ఉంచలేదు. ఉన్న అధికారాలు అలంకార ప్రాయం మాత్రమే. కేబినెట్ సలహాను పాటించడమే ఆయనకి ఉన్న అధికారం. ప్రతి చట్టం పైనా ఆయన సంతకం అయితే ఉండాలి గానీ, నిర్ణయం మాత్రం కేబినెట్, దాని అధినేత అయిన ప్రధాని చేతుల్లోనే ఉంటుంది. అంటే ఆచరణ, అధికారాల రీత్యా ప్రధాన మంత్రే నెంబర్ 1. కానీ…

మేడం-తెలంగాణ -కార్టూన్

“మేడం గారు నిర్ణయం తీసేసుకున్నారు. సరైన సమయంలో దాన్ని బైటపెడతారు.” – భారత దేశం ప్రజాస్వామ్య దేశం అని పాలకులు చెబుతుంటారు. మామూలు ప్రజాస్వామ్య దేశం కూడా కాదు, ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం’ అని వారు తరచుగా చెప్పే మాట! అంటే ఇక్కడ జరిగే నిర్ణయాలన్నీ ప్రజల అభీష్టం మేరకే జరగాలి. ఎన్నికలు జరిగాక, ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీ లేదా పార్టీల కూటమి వివిధ నిర్ణయాలు చేస్తుంది కనుక ఏ…