తెలంగాణ వ(ఇ)చ్చేసినట్లే!

తెలంగాణ ప్రజల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్ష నెరవేరే రోజు కొద్ది దూరంలోనే ఉందన్న సంగతి దాదాపు ఖాయం అయిపోయింది. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసేసుకున్నట్లు అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ది హిందూ పత్రిక తెలియజేసింది. సదరు పత్రిక ప్రకారం ‘ఆహార భద్రతా బిల్లు’ కోసమే ప్రస్తుతం నిర్ణయం ప్రకటన వాయిదా పడింది. తెలంగాణ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన చేసిన వెంటనే సీమాంధ్ర కాంగ్రెస్ ఎం.పిలు రాజీనామా చేసే అవకాశం ఉందని, అలా…

తెలంగాణ అంటే జనం కాదా? -కార్టూన్

కాదన్నట్టే ఉంది కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే. తెలంగాణ ఉద్యమం అంటే ప్రజలు, వారి ఆకాంక్షలు, వారి అవసరాలు కాదు. తెలంగాణ ఉద్యమం అంటే కాంగ్రెస్ దృష్టిలో 2014 ఎన్నికల్లో కురిసే ఓట్లు, సీట్లు మాత్రమే. ఆ మాటకొస్తే ఏ పార్టీకి మాత్రం కాదు? తెలంగాణ వాగ్దానం చేసిన బి.జె.పి కూడా 1999 సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక తెలుగు దేశం సీట్ల కోసం దాన్ని పక్కన పెట్టింది. అవే సీట్ల కోసం రేపు తెలంగాణ ఇవ్వడానికి సోనియా…

ప్రధానికి సోనియా అభయ హస్తం -కార్టూన్

“ఏమీ పట్టించుకోవద్దు, అలా వెళ్తూనే ఉండండి!” – 2జి కుంభకోణంలో తన పాత్రపై మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా చేసిన ఆరోపణలకు బదులివ్వాలని ప్రతిపక్షాలు అరిచి గీపెడుతున్నా ప్రధాన మంత్రి నోరు విప్పడం లేదు. బి.జె.పి నాయకుడు యశ్వంత్ సిన్హా ముచ్చటగా మూడోసారి ఈ విషయమై ప్రధానికి లేఖ రాశారు. ‘మీ మౌనం మీ దోషిత్వాన్ని ఎత్తి చూపుతోంది’ అని ఆయన ఘాటుగా లేఖ రాశారు. అవినీతి ఆరోపణలు వచ్చినపుడు మౌనం వహించడం, విదేశీ కంపెనీలకు దోచి…

ఢిల్లీ పాప అత్యాచారం: పాలకులారా, ఛావెజ్ ను చదవండి!

అత్యంత విలువైన సమయాన్ని పోలీసులు వృధా చేయడంతో పాపను త్వరగా కనుక్కోలేకపోయారని ఢిల్లీ పాప బంధువులు ఆరోపించారు. సోమవారం సాయంత్రం పాప కనిపించకుండా పోయాక కొద్ది సేపు వెతికి గాంధీ నగర్ పోలీసులను ఆశ్రయించామని కానీ వారు రాత్రంగా స్టేషన్ లోనే తమను కూర్చోబెట్టారని వారు తెలిపారు. ఆ తర్వాత రోజు కూడా అదీ, ఇదీ కావాలని తిప్పించారని అసలు వెతికే ప్రయత్నం చేయలేదని తెలిపారు. పాప దొరికిన తర్వాత తండ్రిని పక్కకు పిలిచి గొడవ చేయొద్దని…

కాంగ్రెస్ వర్కింగ్ ఫార్ములా -కార్టూన్

కాంగ్రెస్ ప్రభుత్వంలోని యు.పి.ఏ ప్రభుత్వ పని తీరుపై ‘ది హిందు’ పత్రిక మరో కార్టూన్ బాణం విసిరింది. అవినీతి స్కాముల మూటలు మోస్తూ, సోనియమ్మ చేతిలో కళ్ళెం పట్టుకుని అదపు చేస్తుంటే, ‘మిస్టర్ క్లీన్’ భారంగా బండి లాగుతున్న దృశ్యం, పరిస్ధితిని కళ్ళకు కడుతోంది. కానయితే స్కాములు ప్రధానికి నిజంగా భారమా లేక ఆయనకు తెలిసీ జరుగుతున్నాయా అన్నది చర్చాంశం. 2జి స్కాము మన్మోహన్ కి తెలిసే జరిగిందనీ, జరగబోతున్నది తెలిసినా ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని ఇటీవల…

మన్మోహన్ ప్రభుత్వానికి ఫుల్ మార్కులా? -కార్టూన్

కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ తానే ప్రధాన మంత్రి కావొచ్చని మన్మోహన్ చెప్పినట్లు ఈ మధ్య పత్రికలు గుసగుసలాడాయి. బ్రిక్స్ సమావేశం నుండి తిరిగొస్తూ విమానంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఇచ్చిన అస్పష్ట సమాధానం ఈ గుసగుసలకు కారణం. మీరు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన ఊహాగానాలకు బదులివ్వను అని చెబుతూనే ‘బ్రిడ్జి దగ్గరకు వెళ్ళాక దాన్ని ఎలా దాటాలనేది ఆలిచిస్తాం” అన్నారు. దానర్ధం మళ్ళీ ప్రధాని పదవి ఆయన కోరుతున్నట్లే…

అమ్మాయిల గౌన్లు అశ్లీలమా? వీళ్ళు కదా రేపిస్టులకు కాపలాదార్లు!

స్కూళ్ళు, కాలేజీల అమ్మాయిలు గౌనులు ధరించడం వల్లనే వారికి సమస్యలు వస్తున్నాయనీ, కనుక విద్యార్ధినులు గౌను ధరించడం నిషేధించాలనీ రాజస్ధాన్ కి చెందిన ఒక ఎమ్మెల్యే తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖరాసి కలకలం సృష్టించాడు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఆగ్రహించిన విద్యార్ధినులు ఆయన ఇంటిముందు నిరసన నిర్వహించడమే కాకుండా ఆయనాకొక గౌను బహూకరించారు. అమ్మాయిల దుస్తుల ధారణపై ప్రతికూల వ్యాఖ్యలు చేసి అప్రతిష్టపాలవుతున్న వారి జాబితాలో ఆళ్వార్ నగర నియోజకవర్గ ఎమ్మెల్యే బన్వరీలాల్ సింఘాల్ చేరిపోయాడు.…

సోనియా అల్లుడి కేసులో ‘విచ్ హంట్’ మొదలు

సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కేసులో విచ్ హంట్ మొదలయింది. వాద్రా, డి.ఎల్.ఎఫ్ ల అక్రమ భూ దందా పై విచారణకు ఆదేశించిన సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారిని హర్యానా ప్రభుత్వం ఉన్నపళంగా బదిలీ చేసింది. ఈ బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం సరైన కారణం ఏమీ ఇవ్వడం లేదు. 21 సంవత్సరాల సర్వీసులో 43 బదిలీలు ఎదుర్కోవడం అధికారి నిజాయితీకి తార్కాణం గా నిలుస్తుండగా, వాద్రా అక్రమ ఆస్తులపై విచారణకు ఆదేశించిన సదరు అధికారిని ఉన్నపళంగా బదిలీ…

బొగ్గు ‘మరక మంచిదే’ -కార్టూన్

‘లేచి నిలబడదాం. నిలబడి కలబడదాం’ అని పిలుపునిస్తూ, సోనియా సమర శంఖం పూరించింది. ‘ఆత్మ రక్షణ అనవసరం, కత్తి పట్టి యుద్ధరంగంలోకి దూకండి’ అంటూ సోనియా పిలుపిచ్చిందే తడవుగా చిదంబరం, జైస్వాల్, కపిల్ సిబాల్, మన్మోహన్ సింగ్ తదితర హేమా హేమీలంతా తలా ఒక  కత్తి పట్టి దూకనే దూకారు. ‘బొగ్గు తవ్వనే లేదు, ఇక నష్టం ఎక్కడ’ అని చిదంబరం ప్రశ్నించగానే ‘జీరో లాస్’ అననే అన్నాడు అని పత్రికలు రాసేశాయి. ‘అబ్బే జీరో లాస్…

లేచి కలబడడం కాంగ్రెస్ నాయకులకి సాధ్యమా? -కార్టూన్

 “విన్నావా? నిలబడి కలబడదాం అని అంటున్నారామే”     “ఆత్మ రక్షణలో పడవలసిన అవసరం మనకేమీ లేదు. లేచి నిలబడి కలబడదాం. లక్ష్య శుద్ధితో దూకుడుగా పోరాడుదాం. బ్లాక్ మెయిల్ చెయ్యడం బి.జె.పి కి అలవాటుగా మారింది.” డీలా పడిన కాంగ్రెస్ నాయకులకు స్ధైర్యాన్నివ్వడం కోసం సోనియా గాంధీ అన్న మాటలివి.  బొగ్గు కుంభకోణం వల్ల కేంద్ర ఖజానాకి 1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ వెల్లడి చేసిన దరిమిలా పార్లమెంటు సమావేశాలను వారం రోజులుగా…

కలాం నిజం చెప్పడం లేదు -సుబ్రమణ్య స్వామి

ప్రధాన మంత్రి గా సోనియా గాంధీ నియామకం విషయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నిజాలు చెప్పడం లేదని జనతా పార్టీ నాయకుడు సుబ్రమణ్య స్వామి ఆరోపించాడు. ప్రధాని పదవికి సోనియా నియామకం జరగదని కలాం ఒక లేఖ కూడా సోనియాకి రాశాడనీ, తీరా ఇప్పుడు అందుకు విరుద్ధంగా చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించాడు. ఇటలీ పౌరసత్వం రద్దు చేసుకోకుండా భారత పౌరసత్వం పొందినందున సోనియా గాంధీ ప్రధానమంత్రి కావడానికి నాయపరమైన సమస్యలున్నాయని తాను కలాంకి వివరించాననీ,…

టర్నింగ్ పాయింట్స్: సోనియా ప్రధాని పదవికి తగునని భావించిన కలాం

2004 లో విస్తృతంగా జరిగిన మీడియా ప్రచారానికి విరుద్ధంగా సోనియా కోరినట్లయితే ఆమెను ప్రధానిగా అవకాశం ఇవ్వడానికి తాను సిద్ధపడినట్లు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన ‘టర్నింగ్ పాయింట్స్’ పుస్తకంలో వెల్లడి చేశాడు. సోనియాను ప్రధానిని చేయడానికి వ్యతిరేకంగా అనేకమంది రాజకీయ నాయకులు, పార్టీలు తీవ్ర స్ధాయిలో ఒత్తిడి తెచ్చినప్పటికీ, ‘రాజ్యాంగబద్ధంగా సమర్ధనీయమైన’ ఏకైక అవకాశం అదే అయినందున ఆమెను ప్రధానిని చేయడం తప్ప తనకు మరొక మార్గం లేదని కలాం తన పుస్తకంలో వివరించాడు.…

ఆడలేక ‘మద్దెల ఓడు’ అంటున్న సోనియా

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి సరైన అభ్యర్ధులను నిలబెట్టక పోవడమే కారణమని సోనియా గాంధీ చెపుతోంది. ఓటమి వల్ల యు.పి.ఏ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని విశ్వాసం వ్యక్తం చేసింది. యు.పి ఎన్నికల్లో పార్టీ బలహీనం కావడం వల్లే ఓట్లు పడలేదని తేల్చేసింది. ‘అధిక ధరలు’ పార్టీ అభ్యర్ధుల ఎన్నికల అవకాశాలను దెబ్బ తీసి ఉండవచ్చని కూడా ఆమె అంగీకరించింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయవలసి ఉందని…

కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా, మన్మోహన్ ల నేతృత్వంలో గ్రూపులున్నది నిజమేనా?

భారత దేశం ఎమర్జింగ్ ఎకానమీగా చెలామణి అవుతోంది. చైనా తర్వాత అత్యధిక జిడిపి వృద్ధి రేటు నమోదు చేస్తోంది. ఇంకా చెప్పాలంటే చైనా అధిగమించాలని కలలు కంటోంది. చైనాకు పోటీదారుగా చెప్పుకుంటున్నప్పటికీ చైనా వివిధ రంగాల్లో సాధిస్తున్న ఆర్ధిక ప్రగతితో పోలిస్తే ఇండియా ప్రగతి చాలా దూరంలోనే ఉంది. చైనా ప్రపంచంలో అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ కాగా ఇండియా 11 వ స్ధానంలొ ఉంది. ఆసియాలో చూస్తే చైనా మొదటి స్ధానంలో ఉండగా…