‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ సైగల భాష -బొమ్మలు

ఉద్యమాలు సృజనాత్మకతకు కేంద్రాలుగా భాసిల్లడం అనాదిగా వస్తున్న చరిత్ర. ఉద్యమాలకు ఉండే వివిధ అవసరాలు సృజనాత్మకతకు పదును పెడుతుంటాయి. వందలు, వేల మందిని ఆర్గనైజ్ చెయ్యవలసిన పరిస్ధితుల్లో ఒకరు వందల మందితో, తిరిగి వందలమంది ఒకరితో సంభాషించవలసిన పరిస్ధితుల్లో, దూరంగా ఉంటూ పరస్పరం సంభాషించుకోవలసిన పరిస్ధితుల్లో సైగల భాషకు ‘ఆకుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమం జన్మనిచ్చింది. జన్మనిచ్చింది అనడం కంటే పదును పెట్టింది అనడం సరిగా ఉంటుంది. ‘ఆకుపై’ ఉద్యమాలకు మైక్ పర్మిషన్ ఇవ్వని పరిస్ధుతులనుండి ‘హ్యూమన్…