రాహుల్ సెలవు చీటీ -కార్టూన్

గత కొద్ది రోజులుగా పత్రికల్లో నానుతున్న వార్త ‘రాహుల్ ప్రకటించిన సెలవు (leave of absense).’ ఈ వార్త హెడ్ లైన్ మొదట చదివిన వారికి ఆయనిక శాశ్వతంగా రాజకీయాలకు సెలవు ప్రకటించారేమో అనిపించింది. వార్తలోకి వెళ్ళాక అదేమీ లేదని కొద్ది రోజుల పాటు ఆయన రాజకీయాల నుండి సెలవు పుచ్చుకుంటున్నారని అర్ధం అయింది. అంతలోనే ఆయన ప్రకటన హాస్యస్ఫోరకంగానూ తోచింది. ఎందుకంటే, ఓ పాత కధ ఉండేది. ఒక పంతులు గారు పడవలో నది దాటుతూ…