చర్చించుకుందాం! -ఉక్రెయిన్; మేం సిద్ధం! -రష్యా
శుక్రవారం మరో పరిణామం. ఓ వైపు రష్యా దాడులు కొనసాగుతుండగానే “చర్చించుకుందాం రండి” అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఒక వీడియో సందేశం విడుదల చేశాడు. కాగా, “చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అంటూ రష్యా అధ్యక్షుడి ప్రతినిధి డిమిట్రీ పెష్కోవ్ ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రతిపాదనకు ప్రతిస్పందించాడు. అయితే ఈ పిలుపు, ఆ తర్వాతి స్పందన నిజాయితీగా చేసినవేనా లేక యుద్ధ వ్యూహంలో భాగంగా చేసినవా అన్నది ఇంకా స్పష్టం కావటం లేదు. అయితే బెలారూస్…