మోడీ చంచానే, అందుకు గర్విస్తున్నాను -సి‌బి‌ఎఫ్‌సి చైర్మన్

వ్యక్తి పూజ, పాద పూజ, సైకోఫేన్సీ, గుడ్డి అభిమానం, దురభిమానం మొదలైన లక్షణాలు మూర్తీభవిస్తే (మనిషి రూపం ధరిస్తే) ఆ మనిషి ఎలా ఉంటాడు? మామూలుగా అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టం. ఒకవేళ చెప్పినా దానికి ఆ వ్యక్తి నుండి ఆమోదం పొందటం కష్టం. “అవును. నరేంద్ర మోడీకి చంచానే. మోడీ చంచాగా ఉన్నందుకు గర్వపడుతున్నాను” అని ప్రకటించిన సి‌బి‌ఎఫ్‌సి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) ఛైర్మన్ పహ్లాజ్ నిహలాని ని చూస్తే…