లౌకికవాదం మరియు రాజ్యాంగం -ది హిందు ఎడిట్..

[‘Secularism and the Constitution’ శీర్షికన నవంబర్ 30 తేదీన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం.] ************ దేశంలో సహనం లేదా సహన రాహిత్యంపై  ఇప్పుడు జరుగుతున్న చర్చ విషయమై ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాలు (తమదంటూ) ఓ స్పష్టతను చేర్చాలని భావించబడుతోంది. కానీ ఈ అంశాన్ని చేపట్టక మునుపే బిజెపి నేతృత్వం లోని ఎన్.డి.ఏ ప్రభుత్వం, రాజ్యాంగం ప్రబోధించిన విలువలను ఈ రోజు ఏ మేరకు అర్ధం చేసుకున్నారన్న అంశంపై చర్చ…

లౌకికవాదం ఒక విధాన ఎంపిక కాదు -ది హిందు ఎడిట్

[“Secularism is not a policy option” శీర్షికన ఈ రోజు -ఫిబ్రవరి 19- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. ఇది చాలా విలువైన ఆర్టికల్. ముఖ్యంగా (ఆంగ్లం ఒరిజినల్ లో) రెండవ పేరాలో (అనువాదంలో చివరి పేరాలో) ప్రస్తావించిన అంశాలు కలకాలం గుర్తు పెట్టుకోవలసినవి. పాఠకులు వీలయితే బట్టీయం వేసి సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల రీ ప్రొడ్యూస్ చేసినా తప్పు లేదు. -విశేఖర్] ********** మతం ప్రాతిపదికన హింసా, విద్వేషాలను…

అనిశ్చితికి ముగింపు పలకండి! -ది హిందూ ఎడిట్

(ది హిందు, ఫిబ్రవరి 3, 2015 నాటి సంపాదకీయం ‘End the ambivalence’ కు యధాతధ అనువాదం. -విశేఖర్) ********** రాజ్యాంగం పీఠిక నుండి ‘లౌకిక’ మరియు ‘సామ్యవాద’ పదాలను తొలగించాలన్న డిమాండ్లపై తలెత్తిన వివాదాన్ని తప్పించే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సరిగ్గానే కృషి చేశారు. ది హిందు కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇక అంతకంటే స్పష్టత ఉండబోదన్న రీతిలో వివరించారు: “ప్రస్తుతం ఉన్న పీఠిక ఇప్పుడు ఉన్నట్లుగానే యధాతధంగా…

పాక్ ఉల్లంఘన కూడా చర్చిస్తార్ట!

త్వరలో జరగబోయే పాక్-భారత్ చర్చల్లో పాకిస్ధాన్ ఒప్పందం ఉల్లంఘన గురించి కూడా చర్చిస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పాకిస్ధాన్ తో చర్చలు అంటేనే అంతెత్తున ఎగిరి పడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పే సో కాల్డ్ సెక్యులరిజాన్ని బూటకపు సెక్యులరిజంగా తిట్టిపోసే బి.జె.పి నేతలు ఇప్పుడు అదే పాకిస్ధాన్ తో చర్చలు చేయబోతున్నారు. చర్చలు జరపడమే ఆశ్చర్యం అనుకుంటే గత కొంత కాలంగా పాకిస్ధాన్ పాల్పడుతున్న కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనను కూడా చర్చిస్తామని చెప్పడాన్ని…

ప్లాన్-బి కోసం అద్వానీని పక్కన పెట్టారా? -కత్తిరింపు

ఈ రోజు (సోమవారం, 10.06.2013) ఈనాడు దినపత్రిక ఆరో పేజీలో ఒక ఆసక్తికరమైన విశ్లేషణ ప్రచురించారు. “ఏమో గుర్రం ఎగరా వచ్చు” శీర్షికన వచ్చిన ఈ విశ్లేషణ ప్రకారం అద్వానిని పక్కన పెట్టడం కూడా బి.జె.పి పధకరచనలో ఒక భాగమే. ప్లాన్-ఎ లో మోడి సారధ్యం వహించి పార్టీకి అత్యధిక సీట్లు రాబట్టాలి. ప్లాన్-ఎ విఫలం అయితే ప్లాన్-బి అమలులోకి వస్తుంది. ప్లాన్-బి ప్రకారం మోడి తగినన్ని సీట్లు కూడగట్టలేకపోతే గనక, మోడరేటర్ ముసుగు ధరించిన అద్వానీ…

మోడిని ఎంత విమర్శిస్తే అంత బలం -కార్టూన్

గుజరాత్ లోపల మోడి వాలి టైపు. వాలికి ఎదురు నిలబడి పోరాడినవాడి నుండి సగం బలం వాలికి వచ్చి చేరుతుందట! దానితో శ్రీరాముల వారు సైతం చెట్టు చాటున నిలబడి దొంగ దెబ్బ తీయక తప్పలేదు. మోడి విషయం కూడా అంతే. ఆయనను ఎంత విమర్శిస్తే మోడీకి అంత బలం. మోడిని వ్యక్తిగతంగా విమర్శిస్తే మోడీకి ఇంకా బలం. గత మూడు ఎన్నికల్లో అదే జరిగింది. తనపైన ప్రత్యర్ధులు విరుచుకుపడినప్పుడల్లా దానిని ‘గుజరాత్ ఆత్మాభిమానం’ కింద మలుచుకుని…

‘సెక్యులరిజం అంటే ‘ఇండియా ఫస్ట్’, మోడి కొత్త నిర్వచనం

గుజరాత్ స్త్రీల పోషకాహార లోపానికి ఎవరూ ఊహించలేని కారణం కనిపెట్టి అటు సామాన్యులను, ఇటు శాస్త్ర పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తిన నరేంద్ర మోడి ఈసారి ‘సెక్యులరిజం‘ కు కొత్త నిర్వచనం కనిపెట్టారు. సెక్యులరిజం అంటే ఎక్కడికి వెళ్ళినా ఇండియాను మొదటి స్ధానంలో నిలబెట్టడం అనీ, అన్ని మతాలకు, సిద్ధాంతాలకు అతీతంగా ఇండియాకు మొదటి ప్రాధాన్యం ఇస్తే అదే సెక్యులరిజం అనీ ఆయన నిర్వచించారు. బిజెపి విదేశీ మిత్రులు (Overseas Friends of BJP) ఏర్పాటు చేసిన వీడియో…

చైనాలో వెల వెల బోయిన భారత ప్రజాస్వామ్యం, సెక్యులరిజం

ప్రజాస్వామిక హక్కులు లేవనీ, మానవ హక్కులు మంట గలుస్తున్నాయనీ, భావ ప్రకటనా స్వేచ్చకీ ఇనప దడులు కట్టారనీ చైనాను ఆడిపోసుకోవడం కద్దు. భారత దేశంలోని హిందూమత శక్తులు చైనా మానవహక్కుల చరిత్రపై దాడులకు సదా సిద్ధంగా ఉంటాయి. అలాంటి చోటనే భారతీయులు ఏర్పరిచిన కళా ప్రదర్శనలో గుజరాత్ మత మారణకాండ పై ఉంచిన చిన్న వీడియోను తొలగించాలని భారత ప్రభుత్వం స్వయంగా కోరి సఫలమయింది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే సెక్యులరిజం నేతిబీర లోని నెయ్యి చందమేననీ, రాజకీయ…

బి.జె.పి నోట సెక్యులరిజం మాట

దేశంలో సెక్యులరిస్టు శక్తులకు నిరాశ కలిగించే పరిణామాలు జరుగుతున్నాయంటూ భారతీయ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అది కూడా ఒక ముస్లిం వ్యక్తిని ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా తొలగించినందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన తొలగింపు దేశంలోని సెక్యులరిస్టు శక్తులకు నిరాశను కలిగించిందని వాపోయింది. లక్నోలోని దారుల్ ఉలూమ్‌కు మొహతామిమ్ (వైస్ ఛాన్సలర్‌)గా జనవరిలో నియమితుడయిన మౌలానా గులామ్ మొహమ్మద్ వాస్తన్విని తొలగిస్తూ యూనివర్సిటీ గవర్నింగ్ బాడీ ఐన మజ్లిస్-ఎ-షూరా  ఆదివారం నిర్ణయం తీసుకుంది.…