యోగాపై అమితాసక్తి -ది హిందు ఎడిటోరియల్
శారీరక, మానసిక శ్రేయస్సుకు దోహదం చేసే ప్రయోజక శాస్త్రంగా ప్రపంచవ్యాపితంగా యోగా అంతకంతకూ అధిక గుర్తింపు పొందుతున్న సమయంలోనే, ఈ భారతీయ ప్రాచీన పద్ధతి, ప్రధానంగా నరేంద్ర మోడి ప్రభుత్వం యొక్క దూకుడుమారి ప్రోత్సాహం కారణంగా, అనవసర వివాదంలో చిక్కుకోవడం విచారకరం. (యోగా అమలుపై) ప్రభుత్వం అతిశయాత్మక ఆసక్తి చూపుతోందనీ తన ఉద్యోగులు మరియు సంస్ధలను తన సొంత దృక్పధంతో కూడిన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రచారం చేసేందుకు వినియోగించే ధోరణిలో ఉన్నదన్న భావనలు కలగకుండా ఉండడం చాలా…