ఫైనాన్స్ మత్తగజాల మధ్య సమరమే ‘పనామా పేపర్స్’! -1

[ఈ వ్యాసం మొదట ప్రజా పంధా పక్ష పత్రికలో రెండు భాగాలుగా అచ్చయింది. బ్లాగ్ లో 4 భాగాలుగా ఇస్తున్నాను. -విశేఖర్] ********* ఏప్రిల్ మొదటి వారంలో (4 తేదీ నుండి) ప్రపంచ పౌరులందరినీ ఆకట్టుకున్న వార్త ఒకటి పత్రికల్లో, ఛానెళ్లలో పతాక శీర్షికలను ఆక్రమించింది. దాదాపు ప్రతి దేశంలోనూ తమ పాలకుల అవినీతి, బంధు ప్రీతి, అధికార దుర్వినియోగాల పట్ల విసిగిపోయి ఉన్న ప్రజలకు కొత్తగా ఒక ‘అవినీతి వ్యతిరేక మెస్సయ్యా’ ప్రత్యక్షమయిన భావనను ఆ…