హవాలా స్కాంలో నేను రాజీనామా చేశా -అద్వానీ

బి.జె.పి పితామహుడు మనసులో మాట కక్కేశారు. లలిత్ మోడి అవినీతి కుంభకోణం నుండి బైటపడే మార్గం ఏమిటో తన పార్టీ నాయకులకు చూపారు. వివిధ అవినీతి మరియు అనైతిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే, రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తదితర బి.జె.పి మంత్రులు తక్షణమే తొక్కవలసిన బాట ఏమిటో ఆయన స్పష్టంగా చూపారు. వీరందరికీ మార్గం చూపడం అంటే…

లలిత్ గేట్: మోడి అవినీతి పాలనకు సాక్ష్యం -1

నరేంద్ర మోడి నీతిమంతమైన పాలనలో మొదటి ‘గేట్’ తెరుచుకుంది. ‘నా యేడాది పాలనలో ఒక్క కుంభకోణం అయినా జరిగిందా? నాయకుల పిల్లలు, అల్లుళ్ళకు అయాచిత లబ్ది ఒనగూరిందా? గత యేడాదిలో ప్రజలకు మంచి రోజులు వస్తే దేశాన్ని దోచుకునేవారికి చెడ్డ రోజులు వచ్చాయి” అని తమ ప్రభుత్వ వార్షిక దినాన మోడి ప్రకటించిన కొద్ది రోజులకే ‘లలిత్ గేట్’ బట్టబయలయింది. నరేంద్ర మోడి ఎడతెగకుండా చేస్తున్న ‘నీతిమంతమైన పాలన’ చప్పుళ్లను అపహాస్యం చేస్తూ లలిత్ మోడి పాస్…

క్రికెట్: బడా బాబుల కేకు పంపకం -కార్టూన్

  ఐదు రోజుల టెస్ట్ క్రికెట్ నుండి ఒక్క పూటలో ముగిసిపోయే టి20 మ్యాచ్ ల వరకు క్రికెట్ ఆట ప్రయాణించింది. ఈ ప్రయాణంలో ఆట గమ్యం ఏమిటన్నది చూస్తే జనుల మానసికోల్లాసం కాకుండా డబ్బు సంపాదనే అని స్పష్టం అవుతుంది. ఏ ఆట అయినా మనిషి యొక్క శారీరక, మానసిక, మేధో శక్తులను మెరుగుపరచడానికి, దైనందిన జీవనం నుండి కాసింత బైటపడి సేద తీరడానికీ, ఆరోగ్యం పెంపొందించడానికి పుట్టినదే. కానీ సమాజం డబ్బు జబ్బుతో బాధపడడం…

చైనా-ఇండియాల కోసం సుష్మా షడ్సూత్రాలు

మూడు రోజుల చైనా పర్యటనలో ఉన్న సుష్మా స్వరాజ్ ఇరు దేశాల స్నేహ సంబంధాలు వృద్ధి చెందడానికి ‘పంచశీల’ సూత్రాల తరహాలో ఆరు సూత్రాలను ప్రతిపాదించారు. వీటిని ‘షడ్శీల పధకం’ అనవచ్చో లేదో ఇంకా తెలియదు. బీజింగ్ లో భారత విదేశీ మంత్రి ఆవిష్కరించిన ఆరు సూత్రాలు 1 నుండి 6 వరకు కాకుండా A నుండి F వరకు ఉండడం విశేషం. విదేశీ మంత్రి సుష్మా ప్రకటించిన ఆరు సూత్రాలు ఇలా ఉన్నాయి. A –…

మోడి: ఇక ఛలో చైనా!

అమెరికా వెళ్ళి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడి త్వరలో చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మోడి చైనా సందర్శనకు తగిన దౌత్య ఏర్పాట్లు చేయడం కోసం భారత విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత తీవ్రం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సుష్మా పేర్కొనడం విశేషం. ఇందుకోసం ఇరు దేశాల మీడియా సహకరించాలని సుష్మా స్వరాజ్ తో పాటు చైనా దౌత్యవేత్తలు సైతం…

బంగ్లాదేశ్ అక్రమ వలసలు సున్నిత సమస్య -సుష్మా

ప్రతిపక్షంలో ఉంటే ఓ మాట, అధికారంలో ఉంటే మరొక మాట. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఓట్ల కోసం సవాలక్షా మాట్లాడితే అధికారంలోకి వచ్చాక ఆచితూచి మాట్లాడడం. అధికారం మోపే అనివార్య జాతీయ, అంతర్జాతీయ బాధ్యతల బరువు నిరంతరం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని గుర్తు చేస్తుంటే బలవంతాన నాలుక తీటను అణిచిపెట్టుకోవలసిన అగత్యం దాపురిస్తుంది. తోటి సచివులకి ఆదర్శ వంతులుగా వ్యవహరించాలని హిత బోధలు చేసేందుకు కూడా ప్రేరేపిస్తుంది. ఎన్నికల ముందు అక్రమ బంగ్లాదేశ్ వలస జనం వెనక్కి…

ఔట్‌లుక్ ఇంటర్వూ: బి.జె.పిలో సుష్మా, జైట్లీ ల ఆధిపత్య పోరు

బి.జె.పి పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ ఔట్‌లుక్ వార పత్రిక తాజా సంచికకు ఇంటర్వూ ఇస్తూ ఇనప ఖనిజ అక్రమ తవ్వకాల్లో వేల కోట్లు కాజేసిన గాలి బ్రదర్సుకి కర్ణాటక ప్రభుత్వంలో మంత్రి పదవులిచ్చి పైకి తేవడానికి బాధ్యతను బి.జె.పిలోని మరో నాయకుడు, రాజ్యసభలో బి.జె.పి నాయకుడూ ఐన అరుణ జైట్లీ పైకి నెట్టేసింది. బి.జె.పి పార్టీకి భావి నాయకులుగా భావిస్తున్న ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇలా బహిరంగంగా వేలెత్తి చూపించడం చర్చనీయాంశంగా మారింది. గాలి…