హిందూ దేశంగా మార్చుతామని ప్రతిజ్ఞ, పోలీసులకు ఫిర్యాదు

హిందూత్వ గణాలు దేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతంలో చెలరేగిపోతున్నాయి. ఢిల్లీ లోని గోవింద్ పురి మెట్రో స్టేషన్ సమీపంలో ‘హిందూ యువ వాహిని’ అనే సంస్ధ ఆద్వర్యంలో జరిగిన సదస్సు మరో విడత పరమత విద్వేష ప్రసంగాలకు, ప్రతిజ్ఞలకు వేదికగా నిలిచింది. ఈసారి భారత దేశం మొత్తాన్ని హిందూ దేశంగా మార్చేందుకు చంపడానికి, చావడానికి కూడా సిద్ధమంటూ సభికుల చేత నిర్వాహకులు ప్రతిజ్ఞ చేయించారు. ముస్లింలు, క్రైస్తవులపై జీనోసైడ్ (సామూహిక హత్యాకాండ) జరపాలని, మాజీ ప్రధాని మన్మోహన్…