ప్రధాని భద్రత: కేంద్రానికి సుప్రీం కోర్టు తలంటు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి జనవరి 5 తేదీన పంజాబ్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ఆయనకు భద్రత కల్పించడంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయిందని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి సైతం నాటకీయమైన వ్యాఖ్యలతో రాజకీయ డ్రామాకు తెరలేపారు. డ్రామాను రక్తి కట్టించడం కోసం ఎస్‌పిజి భద్రతా ప్రోటోకాల్స్ అనీ, బ్లూ బుక్ ఉల్లంఘన అనీ చెబుతూ పంజాబ్ అధికారులకు కేంద్రం ఏకపక్షంగా దోషిత్వాన్ని నిర్ధారించి…