సునంద: సహజ మరణం కాదు -ఎఫ్.బి.ఐ

కేరళ కాంగ్రెస్ నాయకుడు, ఐక్యరాజ్య సమితి మాజీ ఉప ప్రధాన కార్యదర్శి, మానవ వనరుల శాఖ మాజీ సహాయ మంత్రి శశి ధరూర్ మరోసారి తప్పుడు కారణాలతో వార్తలకు ఎక్కారు. వార్త పాతది కాకపోయినా వార్త చదివిన గొంతు కొత్తది. శశి ధరూర్ భార్య మరణం సహజమైనది కాదని అమెరికా ఫెడరల్ పోలీసు పరిశోధనా సంస్ధ ఎఫ్.బి.ఐ నివేదిక తాజాగా స్పష్టం చేసింది. తాజా అంటే మరీ తాజా కాదు. ఢిల్లీ పోలీసులకి ఎఫ్.బి.ఐ నివేదిక అంది…

సునంద పుష్కర్: ఆత్మహత్య కాదు హత్యే!

కేంద్ర మాజీ మంత్రి, ఐరాస సెక్రటరీ జనరల్ కి పోటీ పడిన భారతీయుడు శశిధరూర్ మరోసారి చిక్కుల్లో పడ్డట్లు కనిపిస్తోంది. ఆయన భార్య సునంద పుష్కర్ ది ఆత్మహత్య కాదని, ఎవరో ఆమెకు విషం ఇచ్చి చంపారని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు సునంద పుష్కర్ మరణం విషయమై హత్య కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆదేశించారు. రష్యాలో తయారయిన విషం ఇచ్చి సునందను చంపారని, ఈ సంగతి శశి ధరూర్ కు…

సునంద పుష్కర్ పోస్ట్ మార్టంలో యు.పి.ఏ ఒత్తిడి?

కేంద్ర మాజీ మంత్రి శశి ధరూర్ భార్య హఠాన్మరణం విషయంలో తాజాగా వివాదం రగులుతోంది. ఆమె మరణానికి కారణాలు తెలియజేసే పోస్ట్ మార్టం నివేదిక తయారీలో తనపై తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ ఆరోపించడంతో సంచలనం రేగుతోంది. డాక్టర్ ఆరోపణలను ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ అధికారులు హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించడంతో మరిన్ని అనుమానాలు కలగడానికి ఆస్కారం ఏర్పడింది. తన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్…

సునందది ఆకస్మిక, అసహజ మరణం -ఎఐఐఎంఎస్

కేంద్ర మంత్రి శశి ధరూర్ భార్య సునంద పుష్కర్ మరణం “ఆకస్మికం, అసహజం” అని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు చెప్పారు. విష ప్రయోగం జరగలేదని నిర్ధారించారు. మరిన్ని పరీక్షలు జరుపుతామని తెలిపారు. శరీరంపై గాయాలున్నాయని తెలిపారు. ఢిల్లీలో ప్రఖ్యాతి చెందిన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్ధ డాక్టర్లు ఈ విషయాలు తెలిపారు. డాక్టర్ల నిర్ధారణలతో హత్య అన్న అనుమానాలు తలెత్తాయి. సునంద పుష్కర్ శరీరంపై గాయాలున్నాయని డాక్టర్లు చెప్పడాన్ని బట్టి ఆమెపై దాడి…

శశిధరూర్ భార్య సునంద ఆత్మహత్య?!

కేంద్ర మంత్రి శశిధరూర్ భార్య సునంద పుష్కర్ తమ హోటల్ గదిలో చనిపోయి కనిపించారు. ఎఐసిసి సమావేశాలకు హాజరయిన శశి ధరూర్ రాత్రి 8:30 గంటల ప్రాంతంలో హోటల్ కి వచ్చారని హోటల్ సిబ్బందిని ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. కానీ శశిధరూర్ తలుపు తట్టగా ఎంతకూ తెరవలేదని, హోటల్ సిబ్బంది తమ వద్ద ఉన్న మాస్టర్ కార్డ్ తో తెరిచి చూడగా సునంద పుష్కర్ చనిపోయి కనిపించారని ఫస్ట్ పోస్ట్ తెలిపింది. తమ సమాచారానికి ఆధారం…