ఉక్రెయిన్ లో మళ్ళీ రష్యా పై చేయి?
ఉక్రెయిన్ సంక్షోభం తీవ్ర మలుపుల దారిలో ప్రయాణించడం ఇంకా ఆగిపోలేదు. ఇ.యులో ఉక్రెయిన్ చేరికను వాయిదా వేసిన యనుకోవిచ్ ప్రభుత్వాన్ని హింసాత్మక ఆందోళనలతో కూల్చివేయడం ద్వారా ఇ.యు, అమెరికాలో అక్కడ తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగాయి. అయితే వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి రష్యా అనుకూల ఆందోళనలు నిర్వహిస్తుండడంతో నూతన తాత్కాలిక ప్రభుత్వం నిస్సహాయంగా మిగిలిపోతోంది. టెర్రరిస్టులపై దాడి పేరుతో క్రమాటోర్స్కి పైకి పంపిన ఉక్రెయిన్…