టెర్రరిస్టుల చేతుల్లో కొత్త 2 వేల నోట్లు!

పాత 500, 1000 నోట్లు రద్దు చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చెప్పిన కారణాల్లో ఒకటి: టెర్రరిజం ఫైనాన్స్ వనరులను దెబ్బ కొట్టడం. దొంగ నోట్లు, హవాలా డబ్బుతో సీమాంతర ఉగ్రవాదం లేదా పాకిస్తాన్ ప్రేరేపిత కాశ్మీర్ ఉగ్రవాదం పేట్రేగిపోతున్నదని, నోట్ల రద్దు ద్వారా టెర్రరిస్టు ఫైనాన్స్ వెన్ను విరిగిపోతుందని ప్రధాని పిడికిలి బిగించి మరీ చెప్పారు. ప్రధాని చెప్పడమే కాదు, నోట్ల రద్దు వలన కాశ్మీర్ లో టెర్రరిస్టు కార్యకలాపాలు హఠాత్తుగా ఆగిపోయాయని కూడా…

పఠాన్ కోట్ దాడి: పాక్ తో చర్చలు నిలిపేస్తారా?

బి.జె.పి ప్రతిపక్షంలో ఉండగా ఎల్లప్పుడూ వ్యతిరేకించిన అంశం: పాక్ తో చర్చలు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ తో చర్చలు ఎలా చేస్తారని బి.జె.పి ఎప్పుడూ అడుగుతూ ఉండేది. ఆగ్రహావేశాలు ప్రకటిస్తూ ఉండేది. పాక్ వ్యతిరేక భావోద్వేగాలు రెచ్చగొట్టేది. కేంద్ర ప్రభుత్వం చేతగానితనం అని తిట్టిపోసేది. ఇప్పుడు అదే పాకిస్తాన్ తో మిత్రత్వానికి ప్రధాని నరేంద్ర మోడి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అది కూడా ‘అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేసే’ ఆకస్మిక పాకిస్ధాన్ సందర్శన ద్వారా ‘పాక్…

పాక్ ఉల్లంఘన కూడా చర్చిస్తార్ట!

త్వరలో జరగబోయే పాక్-భారత్ చర్చల్లో పాకిస్ధాన్ ఒప్పందం ఉల్లంఘన గురించి కూడా చర్చిస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పాకిస్ధాన్ తో చర్చలు అంటేనే అంతెత్తున ఎగిరి పడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పే సో కాల్డ్ సెక్యులరిజాన్ని బూటకపు సెక్యులరిజంగా తిట్టిపోసే బి.జె.పి నేతలు ఇప్పుడు అదే పాకిస్ధాన్ తో చర్చలు చేయబోతున్నారు. చర్చలు జరపడమే ఆశ్చర్యం అనుకుంటే గత కొంత కాలంగా పాకిస్ధాన్ పాల్పడుతున్న కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనను కూడా చర్చిస్తామని చెప్పడాన్ని…

పైపైకి దూసుకు పోతున్న దాడులు, చొరబాట్లు -కార్టూన్

“అబ్బో!” “అబ్బే, అక్కడ సంతోషించడానికేమీ లేదులెండి. మన సరిహద్దులో పెరుగుతున్న దాడులు, చొరబాట్లను చూపించే గ్రాఫ్ అది!” – ఇటీవలి కాలంలో కాశ్మీరులో భద్రతా బలగాలపై దాడులు పెరిగాయి. చొరబాట్లు కూడా పెరిగాయని పత్రికలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ గడువు (డిసెంబర్ 2014) దగ్గర పడేకొద్దీ కాశ్మీరు లోనూ, సరిహద్దు లోనూ దాడులు పెరగడం గమనార్హం. గడువు సమీపిస్తున్న దృష్ట్యా తాలిబాన్ తో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోడానికి అమెరికా నానా తంటాలు…