అమెరికా ఓడ సిబ్బంది అరెస్టు

అమెరికన్లు ఒక్కరు కూడా లేని ‘సీమన్ గార్డ్ ఒహియో’ ఓడ సిబ్బందిని భారత పోలీసులు మొత్తానికి అరెస్టు చేశారు. అమెరికా ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీ అడ్వాన్ ఫోర్ట్ కి చెందిన ఈ ఓడ సిబ్బందిలో భారతీయులు కూడా ఉన్నారు. కానీ అమెరికన్ ఒక్కరూ లేరు. బ్రిటన్, ఎస్తోనియా, ఉక్రెయిన్ తదితర దేశాలకు చెందిన సిబ్బందిని అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు, చట్ట విరుద్ధంగా డీజెల్ కొనుగోలు చేసినందుకు, భారత సముద్ర జలాల్లో అనుమతి లేకుండా ప్రవేశించినందుకు అరెస్టు…

మేం కాపలా కాసేది మీ నౌకలకే, ఇండియాతో అడ్వాన్ ఫోర్ట్

ఆయుధాలతో పట్టుబడిన అమెరికన్ ప్రైవేటు సెక్యూరిటీ ఓడ కధ ఆసక్తికరమైన మలుపు తిరిగింది. పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు పట్టుబడ్డాయని చెబుతున్న అడ్వాన్ ఫోర్ట్ కి చెందిన ఓడలో లో భారతీయులు కూడా ఉన్న సంగతి గమనించాలని, ఆ ఓడ వాస్తవానికి భారత నౌకల రక్షణ కోసమే నియమించబడిందని కంపెనీ అధ్యక్షుడు విలియం వాట్సన్ చెబుతున్నాడు. భారత నౌకలకు సముద్ర దొంగల నుండి రక్షణ ఇస్తున్న ‘సీమన్ గార్డ్ ఓహియో’ ను అదుపులోకి తీసుకోడం వలన భారత్…

గడ్డి కోసం తాటిచెట్టెక్కిన అమెరికా ప్రైవేటు ఓడ!

‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే, దూడ మేత కోసం’ అన్నాట్ట వెనకటికొకడు. భారత సముద్ర జలాల్లో చట్ట విరుద్ధంగా ప్రవేశించిన ఓడ యజమాని అయిన అమెరికా ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీ చెబుతున్న కారణం కూడా అలాగే ఉంది. అమెరికా ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీ ‘అడ్వాన్ ఫోర్ట్’ కి చెందిన ‘సీమన్ గార్డ్ ఓహియో’ గత శుక్రవారం తమిళనాడు లోని ట్యుటికోరిన్ ఓడ రేవు సమీపంలోని భారత సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించడంతో భారత తీర రక్షణ దళాలు…

భారత సముద్ర జలాల్లో సాయుధ బ్రిటిషర్ల అరెస్టు

భారత సముద్ర జలాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిన ఒక ఓడను ఇండియా అదుపులోకి తీసుకుంది. తమిళనాడులోని ట్యుటుకోరిన్ వద్ద సియర్రా లియోన్ దేశం జెండాతో ఉన్న ఈ ఓడలో అత్యాధునిక ఆయుధాలు ధరించిన బ్రిటిషర్లు ఉన్నారు. వారితో పాటు ఎస్తోనియా, ఉక్రెయిన్, భారత్ జాతీయులు కూడా ఉన్నారని తెలుస్తోంది. సియర్రా లియోన్ జెండా ఉన్నప్పటికీ ఓడ వాస్తవానికి ఒక అమెరికా కంపెనీకి చెందినది. ఓడలో అత్యాధునిక ఆయుధాలు ఉండడంతో అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్నట్లు భారత అధికారులు అనుమానిస్తున్నారు.…