జైల్లో “గాలి”
‘గాలి’ గారిని జైల్లో బంధించడం సాధ్యమవుతుందని నెల రోజుల క్రితం వరకూ ఎవరూ భావించి ఉండరు. కాని దేశంలోని దర్యాప్తు సంస్ధలను వాటిమానాన వాటిని పనిచేయనిస్తే ఒక్క “గాలి” గారినేం ఖర్మ, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న యువరాజు గార్లను కూడా బంధించ వచ్చు. ఆ సంగతినే సి.బి.ఐ రుజువు చేస్తోంది. ఈ క్రియాశీలత ఎన్నాళ్ళుంటుందో తెలియదు కాని, ఒక్కప్పుడు ఊహించనలవి కాని దృశ్యాలను భారత ప్రజ ప్రత్యక్షంగా, టి.వి ఛానెళ్ళలో సంతృప్తిగా, సంతోషంగా, కసిగా, కావలసిందే అన్నట్లుగా…