వివేకరహిత సోదా, రుచివిహీన ఫలితం -ది హిందు

[ఈ రోజు -డిసెంబర్ 17, 2015- ‘Tactless raid, unsavoury fallout’ శీర్షికన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం ఈ ఆర్టికల్. -విశేఖర్] *********** ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై సి.బి.ఐ జరిపిన సోదాలు యోగ్యమైనవేనా అన్న విషయమై కొన్ని ప్రశ్నలు తలెత్తవచ్చు. అంతమాత్రాన అది ఆమ్ ఆద్మీ పార్టీ, బి.జె.పిల మధ్య, నిజానికి ఢిల్లీ మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య రుచి విహీనమైన  రాజకీయ యుద్ధం చెలరేగడానికి దారితీయవలసిన అవసరం లేదు.…

జైట్లీ రక్షణకే సి.బి.ఐని ఉసిగొల్పారు -ఢిల్లీ సి.ఎం

కేంద్ర ఆర్ధిక మంత్రి, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్యాట్రన్ కూడా అయిన అరుణ్ జైట్లీని క్రికెట్ అవినీతి కేసు నుండి రక్షించడానికే తన కార్యాలయంపై సి.బి.ఐ దాడి జరిగిందని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రధాని మోడిని ‘పిరికిపంద’ అనీ, ‘సైకోపాత్’ అనీ నిందించినందుకు విమర్శలు ఎదుర్కొంటున్న అరవింద్ తన నిందలను ఉపసంహరించుకునేందుకు నిరాకరించారు. ట్విట్టర్ పోస్టుల ద్వారా సాగించిన నిందలకు క్షమాపణ చెప్పాలన్న బి.జె.పి డిమాండ్ కు బదులుగా “మోడి…

ఫాసిస్టు పోకడ: కేజ్రీవాల్ ఆఫీస్ పై సి.బి.ఐ దాడి!

భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న ఫాసిస్టు ఆరోపణలు నిజమేనా అన్నట్లుగా సరికొత్త రాజకీయ పరిణామం దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఈ రోజు చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై సి.బి.ఐ అధికారులు ఈ రోజు పొద్దున్నే దాడి చేశారు. ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ వెనువెంటనే ట్విట్టర్ పోస్టుల ద్వారా లోకానికి వెల్లడి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడి అయిన సి.బి.ఐ…

అక్రమ మైనింగ్‌పై సి.బి.ఐ కొరడా, గాలి జనార్ధన్, మరొకరి అరెస్టు

గాలి బ్రదర్స్‌లో నాయకత్వ పాత్రలో కనిపించే గాలి జనార్ధన రెడ్డి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓ.ఎం.సి) ఎం.డి బి.శ్రీనివాస రెడ్డిలను సి.బి.ఐ సోమవారం అరెస్టు చేసింది. సి.బి.ఐ డెప్యుటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ వి.వి.లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం బళ్ళారి చేరుకుని స్వయంగా గాలి జనార్ధన రెడ్డి, బి.శ్రీనివాస రెడ్డిలను అరెస్టు చేసి రోడ్డు మార్గంలో హైద్రాబాద్ కి తీసుకువచ్చారు. ఇద్దరిని అరెస్టు చేశామని సాయంత్రంలోగా సి.బి.ఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామనీ సి.బి.ఐ ప్రతినిదులు తెలిపారు. గాలి జనార్ధన…