సి.ఐ.ఏపై కేసుకు పాక్ కోర్టు ఆదేశం

పాకిస్తాన్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. పాక్ లో పని చేసి వెళ్ళిన సి.ఐ.ఏ మాజీ అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని ఇస్లామాబాద్ హై కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. డ్రోన్ దాడుల ద్వారా హత్య, కుట్ర, దేశంపై యుద్ధం ప్రకటించడం తదితర నేరాలకు పాల్పడినందుకు గాను వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టాలని కోర్టు ఆదేశించింది. అమెరికన్ డ్రోన్ దాడుల్లో తన కొడుకును కోల్పోయిన ఉత్తర వజీరిస్తాన్ పౌరుడొకరు చేసిన…

ఆధార్ వెనక సి.ఐ.ఎ -కత్తిరింపు

భారత పాలకులకు తమ దేశ ప్రజల హక్కులను కాపాడడంలో ఎంతటి నిబద్ధత ఉన్నదో పట్టిచ్చే విషయం ఇది. ఇప్పటికే ఉన్న సవాలక్ష కార్డులకు తోడు సమగ్ర, సమీకృత కార్డు అంటూ ‘ఆధార్ కార్డు’ మన నెత్తిన రుద్దుతున్నారు. ఈ కార్డును తప్పనిసరి చేయడం ప్రజల ప్రాధమిక హక్కులకు విరుద్ధం అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు కూడా గ్యాస్ సిలిండర్ పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేయరాదని కొద్ది రోజుల క్రితమే…

సి.ఐ.ఎ వద్ద డబ్బు తీసుకున్నా, ఆఫ్ఘన్ అధ్యక్షుడి ఒప్పుకోలు

ఆఫ్ఘనిస్ధాన్ ప్రభుత్వంలో అవినీతి గురించి తెగ బాధపడిపోయే అమెరికా అవినీతి భాగోతాన్ని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ స్వయంగా బైటపెట్టాడు. తాను సి.ఐ.ఎ వద్ద డబ్బు తీసుకున్నమాట నిజమేనని కానీ ఆ డబ్బు గాయపడినవారికి, జబ్బు పడినవారికి, కొన్ని ఇళ్లకు అద్దె చెల్లించడానికి వినియోగించానని హమీద్ కర్జాయ్ నమ్మబలికాడు. ఆఫ్ఘనిస్ధాన్ లో సి.ఐ.ఎ లంచాలు మేపడం కొత్తేమీ కాదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక సి.ఐ.ఎ చర్యలను సమర్ధించుకురాగా, సి.ఐ.ఎ సొమ్ము చివరికి తాలిబాన్ వద్దకే చేరుతోందని అనేకమంది…

సి.ఐ.ఏ మరక తుడవడానికి వార్తకు మరక అద్దిన న్యూయార్క్ టైమ్స్

సమాచార స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నట్లు నిరంతరం ఫోజులు పెట్టే పశ్చిమ దేశాల పత్రికలు వాస్తవంలో సమాచార స్వేచ్ఛను తొక్కి పట్టి తమకు అనుకూలమైన సంచారం మాత్రమే ఇస్తూ, ‘సమ్మతిని తయారు చేసే’ (manufacturing consent) పనిలో నిమగ్నమై ఉంటాయన్న నిజాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక మరోసారి రుజువు చేసుకుంది. సి.ఐ.ఏ గూఢచారులు  సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారంటూ వార్త ప్రచురించి 35 నిమిషాల్లోనే దాన్ని మార్చి వేసిన ఘటనను ‘న్యూస్ స్నిఫర్’ అనే వెబ్…

‘టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం’ కోసం గడ్డాఫీతో అమెరికా, బ్రిటన్‌ల గూఢచారి సంబంధాలు

“టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం” పేరుతో అమెరికా ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లపై దురాక్రమణ దాడి చేసింది. లక్షల మందిని పొట్టన బెట్టుకుంది. ఇంకా అక్కడ సైన్యాన్ని కొనసాగిస్తూ రోజూ నరమేధం కొనసాగిస్తూనే ఉంది. ఓ వైపు ఆల్‌ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకోవడానికి ఆఫ్ఘనిస్ధాన్ లో నరమేధం సాగిస్తూనే మరోవైపు లిబియాలో అదే ఆల్‌ఖైదాతో జట్టుకట్టి ఆ దేశ అధ్యక్షుడు గడ్డాఫీను కూలదోసి తన తొత్తు ప్రభుత్వాన్ని కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. మిగతా ప్రపంచం అంతా ఆల్‌ఖైదా,…

లాడెన్ హత్య – సి.ఐ.ఏ ఇన్ఫార్మర్లను అరెస్టు చేసిన పాకిస్ధాన్ ప్రభుత్వం

లాడెన్ హత్యతో సంబంధం ఉందని భావిస్తున్న ఐదుగురు పాకిస్దానీ ఇన్ఫార్మర్లను పాకిస్ధాన్ ఇంటలిజెన్స్ సంస్ధ ఐ.ఎస్.ఐ అరెస్టు చేసింది. ఒసామా బిన్ లాడెన్ హత్య వీరిచ్చిన సమాచారం వల్లనే జరిగిందని భావిస్తున్నారు. వీరు సి.ఐ.ఏ నియమించిన గూఢచారులుగా పని చేస్తూ అబ్బోత్తాబాద్ భవనానికి జరిగే రాకపోకలపై నిఘా ఉంచి ఆ సమాచారాన్ని సి.ఐ.ఏకి చేరవేసినట్లుగా అనుమానిస్తున్నారు. లాడెన్ రక్షణ తీసుకున్న ఇంటికి దగ్గర్లోనే సి.ఐ.ఏ ఒక సేఫ్ హౌస్ ఏర్పాటు చేసుకుంది. ఆ ఇంటి ఓనర్ అరెస్టు…

ఏకంగా సి.ఐ.ఏ వెబ్‌సైట్ నే మూసేసిన ‘లుల్జ్ సెక్యూరిటీ’ హ్యాకర్లు

సి.ఐ.ఏ. కుట్ర, కుతంత్రాల పుట్ట. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో ఎన్నో ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూల్చిన దగుల్బాజీ సంస్ధ. ఎందరో నియంతలను కంటికి రెప్పలా కాపాడిన ధూర్త సంస్ధ. ఎందరో మానవ హక్కుల కార్యకర్తలను, ప్రజాపోరాటాల నాయకులను దుర్మార్గంగా హత్య చేసిన హంతక సంస్ధ. శాంతి విలసిల్లుతున్న దేశాల్లో విభేధాల కుంపట్లు రగిలించి జాతి హత్యాకాండలను ప్రోత్సహించిన జాత్యహంకార సంస్ధ. దాదాపు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోనూ ఏజెంట్లను ఏర్పరుచుకుని అమెరికా అనుకూల-ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు…

అమెరికా ప్రత్యేక దళాలను దేశంనుండి పంపించిన పాక్ ప్రభుత్వం

మొత్తం మీద పాకిస్ధాన్ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. పాక్ సైనికులకు శిక్షణ ఇచ్చే పేరుతో పాకిస్ధాన్ లో తిష్ట వేసిన అమెరికా ప్రత్యేక బలగాలను లేదా సి.ఐ.ఏ గూఢచారులను బాగా తగ్గించాలని పాక్ ప్రభుత్వం గత కొన్ని వారాలనుండి అమెరికాను కోరుతూ వచ్చింది. ఈ విషయమై ఇరు దేశాల మిలట్రీ ప్రతినిధుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు పాకిస్ధాన్ లో ఉన్న సి.ఐ.ఏ గూఢచారుల్లో 90 మందిని అమెరికాకి తిప్పి పంపినట్లుగా పాక్ ప్రభుత్వం…