అమెరికా, ఇటలీ రాజకీయ సంక్షోభం; ఇండియా షేర్లు పతనం
‘ఎంకి చావు, సుబ్బు చావుకొచ్చింది’ అని కొత్త సామెత రాసుకోవాలి. అంతర్జాతీయంగా పెట్టుబడుల ప్రవాహాలకు గేట్లు తెరిచిన ‘ప్రపంచీకరణ’ విధానాలు ఆర్ధిక వ్యవస్ధలను అతలాకుతలం చేయగల శక్తిని సంతరించుకోగా, పులిని చూసి వాతలు పెట్టుకున్న నక్కల్లాగా షేర్ల వ్యాపారంలో అదృష్టం పరీక్షించుకుంటున్న మధ్యతరగతి జనం చివరకు దురదృష్ట జాతకులై తేలుతున్నారు. లేకపోతే అమెరికాలో రిపబ్లికన్-డెమోక్రటిక్ పార్టీల సిగపట్లు, ఇటలీలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న అవినీతి సామ్రాట్లు ఇండియా షేర్ మార్కెట్లను కుదేయడం ఏమిటి? సోమవారం బి.ఎస్.ఇ సెన్సెక్స్…