నమ్మించి దగా చెయ్యటం అమెరికా విద్య -కార్టూన్

కువైట్ దేశం చారిత్రకంగా ఇరాక్ లో భాగం. చమురు వాణిజ్యం విషయమై కువైట్ తో ఇరాక్ కి సమస్య వచ్చింది. చర్చలు జరిగాయి. కువైట్ వినలేదు. ఇక భరించ లేము. కువైట్ ని కలుపుకుంటాం అని సద్దాం అమెరికాకి చెప్పాడు. ఆ విషయం మాకు సంబంధం లేదు. అది మీ సమస్య అని అమెరికా చెప్పింది. సద్దాం అమెరికాని నమ్మాడు. కువైట్ లోకి సైన్యాన్ని నడిపాడు. అంతే. అమెరికా గావు కేకలు వేసింది. సద్దాం పై రెండు…

ఇసిస్: అమెరికా ట్రోజాన్ హార్స్ -కార్టూన్

హాలీవుడ్ సినిమా ‘ట్రాయ్’ చూసారా? అందులో గ్రీకులు ట్రాయ్ ద్వీప రాజ్యాన్ని ఒక చెక్క గుర్రం సహాయంతో వశం చేసుకుంటారు. ట్రాయ్ కధ పుక్కిటి పురాణం అని కొట్టివేసేవారు ఎంతమంది ఉన్నారో, నిజమే అని నమ్మేవారు అంత మంది ఉన్నారు. ట్రాయ్ వాసులను ట్రోజన్లు అంటారు. నగర ద్వీప రాజ్యమైన ట్రాయ్ ని జయించడానికి పదేళ్ళ పాటు చుట్టుముట్టినా గ్రీకుల వల్ల కాదు. ట్రాయ్ కోట శత్రు ధుర్భేద్యం కావడం, ట్రోజన్లు మహా వీరులు కావడంతో కోటలోకి…

జేమ్స్ ఫోలి చావు మరో వరల్డ్ వార్ కు దారి తీస్తుందా?

ఇస్లామిక్ స్టేట్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంత్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా కు చెందిన మిలిటెంటు ఒకరు అమెరికా విలేఖరి జేమ్స్ ఫోలీ తలను కత్తితో కోసి చంపినట్లు చూపుతున్న వీడియో ఇటీవల ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అయింది. ఈ వీడియోను సాకుగా చూపుతూ అమెరికా మళ్ళీ మధ్య ప్రాచ్యంలో మరో యుద్ధానికి నగారా మోగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ఒబామా, బ్రిటన్ ప్రధాని కామెరాన్ లు యుద్ధ జ్వర పీడితులైనట్లుగా ప్రకటనలు గుప్పిస్తుండగా…

సిరియా యుద్ధరంగంలోకి దూకనున్న ఇరాన్

సిరియా కిరాయి తిరుగుబాటులో స్టేక్స్ పెరుగుతున్నాయి. సౌదీ అరేబియా, కతార్, టర్కీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటికే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సిరియా తిరుగుబాటులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ దేశాల మద్దతుతోనే ఆల్-ఖైదా టెర్రరిస్టులు సిరియా ప్రజలపై మారణహోమం సాగిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాలు అందిస్తున ధన, ఆయుధ సహాయంతో అధ్యక్షుడు బషర్ ఆల్-అసద్ కూల్చివేతకు రెండేళ్లుగా సాయుధంగా తలపడుతున్నారు. ఇరాన్, రష్యాల మద్దతుతో కిరాయి తిరుగుబాటును ఎదుర్కొంటున్న సిరియా ప్రభుత్వానికి ప్రత్యక్షంగా సహకరించడానికి ఇప్పుడు…